రసవత్తరంగా ఫ్యాన్సీ నంబర్ల వేలం.. | RTA gains huge amount of money in fancy numbers auction | Sakshi
Sakshi News home page

కారు ధర రూ.1కోటి.. నంబర్‌కు రూ. 7.5 లక్షలు!!

Published Mon, Oct 16 2017 8:57 PM | Last Updated on Mon, Oct 16 2017 9:09 PM

RTA gains huge amount of money in fancy numbers auction

జాగ్వర్‌ ఎక్స్‌జే 3.0ఐడీ మోడల్‌ కారు(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ : కారు ఖరీదు ఎంతన్నదేకాదు.. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఏమిటన్నది కూడా కొందరికి ప్రెస్టేజ్‌ ఇష్యూనే! అందుకే, లక్షలు పోసిమరీ ఫ్యాన్సీ నంబర్లు సొంతం చేసుకుంటారు!! ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయం సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం రసవత్తరంగా ముగిసింది. వేలం ద్వారా రవాణా శాఖకు రూ. 24,96,953 ఆదాయం సమకూరింది.

కోటి రూపాయల కారుకు 7.5 లక్షల నంబర్‌ : TS 09 EW 0001 నంబర్‌కు గానూ ప్రముఖ రిటైల్‌ వ్యాపార సంస్థ మున్నా యునైటెడ్‌ అక్షరాల రూ. 7,56,695 చెల్లించింది. సంస్థ ఇటీవలే కొనుగోలు చేసిన జాగ్వర్‌ ఎక్స్‌జే 3.0ఐడీ మోడల్‌ కారు కోసం వారు ఈ నంబర్‌ను కొనుగోలుచేశారు. కారు ధర రూ.1,00,63,502 అని అధికారులు పేర్కొన్నారు.

మెగా మళ్లీ : ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్‌ యజమాని భారీ ధరకు ఫ్యాన్సీ నంబర్‌ కొనుగోలుచేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తాను కొనుగోలుచేసిన బెంజ్‌ కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ TS 09 EW 0009ను రూ.4,70,00కు దక్కించుకున్నారు. ఆ కారు ధర రూ.1,63,50,000. గతంలోనూ ఫ్యాన్సీ ధరను కోట్‌చేసి ఫ్యాన్సీ కారు కొన్న మెగా ఓనర్‌ మరోసారి అదేపని చేశారు.

0006 @1.6 లక్షలు : వై. కామేశ్‌ అనే వ్యక్తి తన ఫోర్డ్‌ ఎండీవర్‌ కారు కోసం TS 09 EW 0006 నంబర్‌ను రూ.1,61,899 చెల్లించి కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement