Allu Arjun Fans Fires On Comedian Mukku Avinash Over Recreating Pushpa 2 Look, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun : కమెడియన్‌ ముక్కు అవినాష్‌పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం..

Published Tue, Apr 11 2023 11:25 AM | Last Updated on Tue, Apr 11 2023 11:58 AM

Allu Arjun Fans Fires On Comedian Mukku Avinash Over Pushpa 2 Look - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. రెండేళ్ల క్రితం​ వచ్చిన పుష్ప బ్లాక్‌ బస్టర్‌ సినిమాకి సీక్వెల్‌ ఇది. సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ షరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2 నుంచి అదిరిపోయే స్పెషల్‌ వీడియోతో పాటు బన్నీ లుక్‌ని రివీల్‌ చేసి మేకర్స్‌ షాక్‌ ఇచ్చారు. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన క్షణాల్లోనే పుష్ప-2 పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

చీరకట్టు, ముక్కు పుడకతో కనిపించి బన్నీ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప-2 లుక్‌ని ఇమిటేట్‌ చేస్తూ అరకొర ఎడిటింగ్‌తో పుష్పరాజ్‌లా మారిపోయాడు కమెడియన్‌ అవినాష్‌. జబర్దస్త్‌ స్కిట్స్‌, బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన ముక్కు అవినాష్‌ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాడు.

ఈ క్రమంలో తాజాగా బన్నీ లుక్‌ని కాస్త మార్ఫింగ్‌ చేసి తన ఫోటోను పెట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అవినాష్‌పై ఫైర్‌ అవుతున్నారు.అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ ఫ్యాన్స్‌ కౌంటరిస్తున్నారు. అర్జెంట్‌గా ఫోటో డిలీట్‌ చేయకపోతే బాగోదు అంటూ వార్నింగ్‌లు ఇస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement