Score
-
అపోహలు వీడితేనే మంచి స్కోరు
ఆర్థిక అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకునేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సంస్థలు రుణాలపై విధించే వడ్డీరేట్లు కూడా భారీగా ఉన్నాయి. మంచి క్రెడిట్ స్కోరు సొంతం చేసుకుంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంచి స్కోరు(CIBIL score)ను సాధించాలంటే దీనిపై ఉన్న అపోహలు వీడాలని సూచిస్తున్నారు.ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు సాలరీ ఆధారంగా క్రెడిట్ కార్డు(Credit Card) ఆఫర్ ఉందని ఫోన్లు వస్తుంటాయి. దాంతో చాలామంది క్రెడిట్‌కార్డును తీసుకుంటున్నారు. తొలి కార్డును సంపాదించడమే కొంత కష్టం. ఆ తర్వాత కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోరును ఆధారంగా చేసుకుని తమ క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ ముందుకు వస్తాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే దశలో చాలామందికి కొన్ని సందేహాలున్నాయి. వాటిపై స్పష్టత ఉంటే స్కోరు దూసుకెళ్లేలా చేయవచ్చు.ఆదాయం అవసరమా..?క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాలంటే రాబడి బావుండాలని అనుకుంటారు. కానీ, ఆదాయంతో సంబంధం ఉండదు. ఏటా రూ.6 లక్షలు ఆదాయం ఉన్నవారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండొచ్చు. ఏటా రూ.20 లక్షల ఆదాయం(Income) ఉన్నవారి స్కోరు పేలవంగా ఉండొచ్చు. వారు గతంలో తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు సరళి ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా సకాలంలో బిల్లులు చెల్లించడం, తక్కువ క్రెడిట్ వినియోగం వంటివి స్కోరు పెరిగేందుకు దోహదపడుతాయి.కార్డును పూర్తిగా వాడవచ్చా..?క్రెడిట్ కార్డు పరిమితి పూర్తిగా వాడలేదు కదా, స్కోరు పడిపోయిందనే సందేహం వ్యక్తం చేస్తారు. నిజానికి కార్డు మొత్తం పరిమితి మేరకు వినియోగిస్తే స్కోరుపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్(Card Limit) రూ.1 లక్ష అనుకుందాం. మీరు అందులో సుమారు 40 శాతం అంటే రూ.40,000 వినియోగిస్తే మేలు. లిమిట్ ఉందని రూ.90,000 వరకు లిమిట్ వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఏకమొత్తంలో అధికంగా క్రెడిట్ కార్డు వాడితే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది.పాత కార్డులను క్లోజ్ చేయాలా..?గతంలో వాడి, ప్రస్తుతం వాడకుండా ఉన్న కార్డులను క్లోజ్ చేస్తే స్కోరు పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇందులో నిజం లేదు. గతంలో మీరు వాడిన కార్డులపై క్రెడిట్ హిస్టరీ జనరేట్ అవుతుంది. మీరు కార్డు క్లోజ్ చేస్తే ఆ హిస్టరీ కూడా డెలిట్ అవుతుంది. సుధీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉంటే స్కోరు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘పెండింగ్ సబ్సిడీలను విడుదల చేయాలి’స్కోరు పెరగాలంటే..గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలి.సమయానికి ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రుణాలు తీసుకునే ముందు అన్ని తరహా లోన్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. హోమ్ లోన్స్, కారు లోన్స్‌ను సెక్యూర్డ్ లోన్స్గా పరిగణిస్తారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్(Loans)ను అన్సెక్యూర్డ్ లోన్స్గా భావిస్తారు. ఇలా మీరు సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బ్యాంకులు మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి.క్రెడిట్ కార్డు లిమిట్‌ను పూర్తిగా ఉపయోగించొద్దు. కార్డు లిమిట్లో కేవలం 30-40 శాతం మాత్రమే ఉపయోగించాలి. ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.ఎదుటివారు తీసుకునే రుణాలకు గ్యారెంటీగా ఉండకూడదు. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏదైనా పరిస్థితుల్లో రుణం చెల్లించకుండా డీఫాల్ట్ అయితే గ్యారెంటీ మీరు కాబట్టి మిమ్మల్ని చెల్లించమంటారు. ఆ సమయానికి డబ్బు సమకూరకపోతే అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది.క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించేప్పుడు వీలైతే రెండు దఫాలుగా పే చేయండి. ఉదాహరణకు మీ బిల్లు రూ.12000 అనుకుందాం. పేమెంట్ తేదీ 15 నుంచి 30వ తేదీ వరకు ఉందనుకుందాం. ఈ 15 రోజుల్లో ఒకసారి రూ.6000 మరోసారి మిగిలిన రూ.6000 చెల్లించండి. దాంతో మీ పేమెంట్ రెండుసార్లు రికార్డు అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది. -
PKL Season 11: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం
హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్‌ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్‌ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్ పాయింట్‌తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత అస్లాం ఇనాందర్‌ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్‌ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్‌కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్‌లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది. కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది. -
ఐపీఎల్లో సన్‌రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్‌ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్‌ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్‌ను రెండుసార్లు సన్‌రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి!
రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే న్యూ భారత్ ఎన్సీఏపీ (Bharat NCAP) నిబంధనలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నియమాలు 2023 అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానున్నాయి. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ అనేది దాదాపు గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని వ్యత్యాసాలను గమనించవచ్చు. గ్లోబల్ ఎన్సీఏపీ కింద, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో వాహనం గరిష్టంగా 34 పాయింట్లు స్కోర్ చేయగలదు. కానీ భారత్ ఎన్సీఏపీ కింద 32 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రెండు టెస్టింగ్ ప్రోటోకాల్‌లు ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం ఒక్కొక్కటి 16 పాయింట్లను అందిస్తాయి. భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ పొందాలంటే ఎంత స్కోర్ చేయాలి? ఎంత స్కోర్ చేస్తే 1 స్టార్ రేటింగ్ లభిస్తుందనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రెంట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు! ఒక కారు భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకోవాలంటే.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 41 పాయింట్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 22 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 35 పాయింట్లు స్కోర్ చేస్తే 4 స్టార్ రేటింగ్ లభిస్తుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 16 పాయింట్లు సాధిస్తే 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో వరుసగా 10, 4 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 18, 9 పాయింట్లు స్కోర్ చేస్తే 2 స్టార్ రేటింగ్ & 1 స్టార్ రేటింగ్ లభిస్తుంది. -
డొమినికా టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 421/5 డిక్లేర్డ్
-
WTC ఫైనల్ కోహీ VS గిల్
-
ప్లే ఆఫ్స్ కి వెళ్లే టీం ఏవి?
-
89 పర్సంటైల్ సాధిస్తే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023 పరీక్షలు శనివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా తొలి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు నిర్వహించారు. తొలి సెషన్‌కు 8.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 8.23 లక్షల మంది, రెండో సెషన్ పరీక్షలకు 9.4 లక్షల మంది రిజిస్టర్ కాగా 99 శాతం మంది హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గణాంకాలు చెబుతున్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రశ్నల తీరు గత ఏడాది మాదిరిగానే ఉన్నందున అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు కూడా అదే విధంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్ల కటాఫ్ స్కోరు మార్కులను పరిగణనలోకి తీసుకొని ఈసారి జనరల్ కేటగిరీకి 88 నుంచి 89 స్కోరు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌కు అర్హులవుతారని చెబుతున్నారు. రెండో సెషన్ ప్రాథమిక కీ, అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది. వీటిపై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం ర్యాంకులతో సహా తుది ఫలితాలను ప్రకటించనుంది. 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.50 లక్షల మందికి ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అవకాశం కల్పిస్తారు. అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభమవుతుంది. అందువల్ల నెలాఖరులోగానే మెయిన్ ఫలితాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఎత్తేసిన అడ్వాన్స్‌డ్‌కు అర్హతకు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు పొంది ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది నుంచి ఎన్టీఏ పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు సాధిస్తేనే ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత పొందుతారు. తొలి సెషన్ మాదిరిగానే రెండో సెషన్ ప్రశ్నలు రెండో సెషన్ పరీక్షల ప్రశ్నల కాఠిన్యత మొదటి సెషన్ మాదిరిగానే ఉందని అభ్యర్థులు తెలిపారు. చివరి రోజైన శనివారం కెమిస్ట్రీ పేపర్ మోడరేట్‌గా ఉందని తెలిపారు. ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీలకన్నా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఫిజిక్సులో ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పలు విద్యా సంస్థల అధ్యాపకులు చెప్పారు. 12వ తరగతి చాప్టర్లలోని అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. కైనమెటిక్స్, గ్రావిటేషన్, సింపుల్ హార్మొనిక్ మోషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, సర్క్యులర్ మోషన్, రొటేషన్ మోషన్, ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఏసీ సర్క్యూట్స్, మోడర్న్ ఫిజిక్సు, రే, వేవ్ ఆప్టిక్స్ అంశాలతో సహా న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలను అడిగారు. మేథమెటిక్స్‌లో ప్రశ్నలు మోడరేట్‌గా, అన్ని చాప్టర్ల నుంచి వచ్చాయని అధ్యాపకులు వివరించారు. అభ్యర్థులకు ఒకరికి కష్టంగా, మరొకరికి సులభంగా ప్రశ్నలు వచ్చాయనే పరిస్థితి తలెత్తకుండా అందరికీ సమన్యాయం జరిగేందుకు నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా స్కోరు మార్కులు ప్రకటించనున్నారు. అత్యధిక, అత్యల్ప స్కోరులను ఆధారం చేసుకొని నార్మలైజేషన్ చేయడం ద్వారా అభ్యర్థులకు స్కోరు లభిస్తుంది. -
వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతి అమ్మాయి
ప్రపంచంలోనే అంత్యంత తెలివైన స్టూడెంట్స్ లిస్ట్‌లో భారత సంతతి అమ్మాయి స్థానం దక్కించుకుంది. యూఎస్ ఆధారిత జాన్స్ హాప్కిన్స్ సెంటర్‌ఫర్ టాలెంటెడ్ యూత్(సీటీవై) నిర్వహించిన పరీక్షలో భారతీయ అమెరికన్ నటాషా పెరియనాగం రెండోసారి విజయం సాధించింది. 13 ఏళ్ల పెరియనాగం న్యూజెర్సీలో ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడల్ స్కూల్ విద్యార్థి. ఆమె గతంలో 2021లో గ్రేడ్ 5 విద్యార్థిగా ఉన్నప్పుడూ కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐతే ఆ ఏడాది ఆమె సీటీవై నిర్వహించిన వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో గ్రేడ్ 8 స్థాయిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించి ఆ అత్యున్నత జాబితాలో స్థానం దక్కించుకున్నారు కూడా. మళ్లీ ఈ ఏడాది ఎస్ఏటీ, ఏసీటీ స్కూల్, కాలేజ్ స్థాయిలో అదే విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి మరోసారి ఈ గౌవరవ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ సీటీవై విశిష్ట ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడం కోసం వారి విద్యా నైపుణ్యాలను వెలికితీసేలా ఏటా అత్యున్నత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, పెరియనాగం తల్లిదండ్రులు చైన్నైకి చెందిన వారు. 2021-22 సీటీవై పరీక్షకి 76 దేశాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. సుమారు 15 వేల మంది ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. వారిలో చైన్నైకి చెందిన పెరయనాగం కూడా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఈ తాజా ప్రయత్నంతో పెరియనాగం అభ్యర్థులందరి కంటే అత్యధిక గ్రేడ్ సాధించి వరుసగా రెండుసార్లు ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న అమ్మాయిగా నిలిచినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ మేరకు సీటీవై డైరెక్టర్ డాక్టర్ అమీ షెల్టాన్ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక పరీక్షలో విద్యార్థులు సాధించిన విజయం మాత్రం కాదని, చిన్న వయసులో వారి అభిరుచులను గుర్తించడమే గాక ఆ దిశ తమ ప్రతిభకు మెరుగులు పెట్టుకోవడం ప్రశంసించదగ్గ విషయం. అలాగే వారి మహోన్నతమైన తెలితేటలకు సెల్యూట్. ఈ అనుభవంతో విద్యార్థులు మరిన్ని గొప్ప విజయాలను అందుకోవాలి అని డాక్టర్ అమీ ఆకాంక్షిచారు. (చదవండి: మిస్టరీగా కిమ్ ఆచూకీ.. పీపుల్స్ ఆర్మీ వార్షికోత్సవం హాజరుపై సందిగ్ధం) -
లబుషేన్, స్మిత్ సెంచరీలు
గాలె: శ్రీలంకతో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. మార్నస్ లబుషేన్ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (212 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. లబుషేన్ వ్యక్తిగత స్కోరు 28 వద్ద శ్రీలంక కీపర్ డిక్వెల్లా స్టంపింగ్ అవకాశాన్ని వదిలేశాడు. ఉస్మాన్ ఖాజా (37; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... వార్నర్ (5), ట్రావిస్ హెడ్ (12), కామెరాన్ గ్రీన్ (4) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ప్రస్తుతం స్మిత్‌తో కలిసి అలెక్స్ క్యారీ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు తీయగా, కాసున్ రజిత, రమేశ్ మెండిస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో కామిందు మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య టెస్టుల్లో అరంగేట్రం చేశారు. -
ఓవర్లో ఆరు సార్లయినా డైవ్ చేస్తా!
వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని దాటడం సంతోషంగా ఉందని, అయితే ఇప్పటికీ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమిస్తానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. పదేళ్లు దాటినా పరుగులు సాధించడంలో ఉదాసీనత ఉండరాదని అతను అన్నాడు. బుధవారం వైజాగ్ వన్డేలో పది వేల పరుగులు పూర్తి చేసుకొని సచిన్ టెండూల్కర్ కంటే వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అనంతరం తన మనోభావాలను బీసీసీఐ వెబ్‌సైట్‌తో పంచుకున్నాడు. కోహ్లి స్పందన అతని మాటల్లోనే... ‘పది వేల పరుగులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేను ఎంతో అదృష్టవంతుడినని చెప్పగలను. నా వన్డే కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. సాధారణంగా అయితే నా దృష్టిలో ఇలాంటి వ్యక్తిగత మైలురాళ్లకు చోటు లేదు. అయితే పదేళ్లుగా ఆడుతూ ఇక్కడి దాకా చేరుకున్నామనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే ఇది అంత ప్రత్యేకమని చెప్పగలను. నేను ఈ ఆటను అమితంగా ప్రేమించడమే నా ఆనందానికి మరో కారణం. అలాంటి క్రికెట్‌ను ఇంకా ఇంకా ఆడాలని భావిస్తున్నా కాబట్టి ఇదో విశేషంగా భావిస్తున్నా. ఇంత సుదీర్ఘంగా ఆడగలగడం సంతృప్తిగా ఉంది. మరిన్ని సంవత్సరాలు దీనికి జత కావాలి. ఇంతటి ఘనతను సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. భారత్ తరఫున ఆడితే చాలనుకున్నాను. ఇంతటి చిరస్మరణీయ రోజు వస్తుందనే ఆలోచన కూడా నాకు రాలేదు. మనం ఏం చేసినా దానిపైనే శ్రద్ధ పెట్టి సరైన దారిలో శ్రమించాలని మాత్రం తెలుసు. ఇలాంటి రికార్డులు కొంత కాలం తర్వాత చూస్తే ప్రాధాన్యత లేనివిగా కనిపిస్తాయి. పరుగులు చేయడమే నాకు తెలిసిన విద్య. సుదీర్ఘ కాలంగా దానిని పూర్తి చేసే క్రమంలోనే ఇలాంటి ఘనత దక్కింది. ప్రతీ మ్యాచ్‌లో జట్టు కోసం, జట్టు అవసరాలకు అనుగుణంగా భారీ స్కోరు కోసం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నాకు తెలుసు.భవిష్యత్తుల్లో కూడా ప్రతీ మ్యాచ్, ప్రతీ పరిస్థితుల్లో అలాంటి పరుగులు చేయాలనుకుంటున్నా. శారీర కంగా, మానసికంగా కూడా నా శక్తియుక్తులు జట్టు కోసం పరుగులు సాధించేందుకు వెచ్చించాను. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటూ బ్యాట్‌తో నా పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. నా ఒక్కడి గురించి ఆలోచించి ఉంటే ఇలాంటి రికార్డులు రాకపోయేవేమో. బయటి నుంచి చూసేవారికి ఇదంతా మామూలుగానే కనిపించవచ్చు. కానీ కఠిన పరిస్థితులు ఎదురైన సమయంలో జట్టు కోసం తీవ్రంగా శ్రమించడం, మరో 10–12 ఓవర్లు అదనంగా ఆడితే వచ్చే పరుగులతో భారీ స్కోరుకు సహకరించడం ఎంతో ముఖ్యం. దేశం తరఫున ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం. అయితే పదేళ్ల తర్వాత కూడా దానిని నాకు లభించిన ప్రత్యేక హక్కుగా భావించడం లేదు. ఇప్పటికీ ప్రతీ పరుగు కోసం నేను కూడా తీవ్రంగా శ్రమించాల్సిందే. ఎందుకంటే భారత జట్టులో ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. మనకు ఆ అవకాశం ఉన్నప్పుడు పరుగులు చేసే విషయంలో అదే ఆకలి, తపన ఉండాలి. ఏ విషయంలోనూ ఉదాసీనత కనబర్చకుండా, అలసత్వం దరి చేరనీయకుండా ఆడాలి. పరుగు పూర్తి చేసే క్రమంలో ఒకే ఓవర్లో ఆరు సార్లు డైవ్ చేయాల్సి వచ్చినా నేను వెనుకాడను. ఎందుకంటే నేను దేశం తరఫున ఆడేందుకు ఎంపికయ్యాను. అది నా బాధ్యతతో పాటు ఉద్యోగ ధర్మం కూడా. ఇలా నేను ఎవరికి మేలు చేయడం కోసమో ఆడటం లేదు. పైగా ఎవరి కోసమో నేను నిరూపించాల్సిన పని లేదు.నా శ్రమంతా ఆ అదనపు పరుగు కోసమే. నేను శారీరకంగా లేదంటే మానసికంగా అలసిపోయానని చెప్పి ఆ పరుగు తీయకుండా ఉండలేను. జట్టుకు ఉపయోగపడేందుకు ఏం చేయాల్సి వచ్చినా ఎప్పుడైనా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను’ -
ఎకనామిక్స్ లో 100, గుజరాతీలో 13 !
గుజరాత్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియేట్ ఫలితాల్లో ఓ విద్యార్ధికి ఆశ్చర్యకరమైన మార్కులు వచ్చాయి. మొత్తం ఏడు సబ్జెక్టుల్లో ఐదింట ఫెయిలయిన అతను.. ఎకనామిక్స్ లో 100 కు 100 మార్కులు సాధించాడు. దీంతో టీచర్లు, విద్యారంగం నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎకనామిక్స్ లో ఫుల్ మార్కులు సాధించడం చాలా అరుదని అలాంటిది గుజరాతీ భాషలో 100కు కేవలం 13 మార్కులు, సంస్కృతంలో 4, సోషియాలజీలో 20, ఫిజియాలజీలో 5, జాగ్రఫీలో 35 సాధించిన విద్యార్ధికి రావడం విచిత్రంగా ఉందని అంటున్నారు. దీనిపై స్పందించిన విద్యారంగ నిపుణుడు డా. కిరీట్ జోషీ మార్కుల కూడికలో తప్పు కావొచ్చని లేకపోతే 10 సంఖ్యను పొరబాటుగా 100గా మార్చివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై టీచర్లు, విద్యానిపుణులు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. -
జీప్యాట్‌లో మెరుగైన స్కోర్‌కు మార్గాలు...
సిలబస్ జీప్యాట్‌లో మంచి స్కోర్ సాధించాలంటే ప్రధానంగా ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.ఫార్మాస్యూటిక్స్: ఇంట్రడక్షన్ టు ఫిజికల్ ఫార్మసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇన్ ఫార్మసీ, ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ ఎథిక్స్, ఇంట్రడక్షన్ టు డిస్పెన్సింగ్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ..ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఇనార్గానిక్ ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇన్ ఫార్మసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ.. ఫార్మాస్యూటికల్ అనాలిసిస్: టెక్నిక్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, టైట్రేషన్స్, ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్, క్రొమటోగ్రఫీ, క్వాలిటీ అస్యూరెన్స్..ఫార్మకాలజీ: పాథో ఫిజియాలజీ ఆఫ్ కామన్ డిసీజెస్, ఇమ్యూనో పాథోఫిజియాలజీ, జనరల్ ఫార్మకాలజీ, ఫార్మకాలజీ (పెరిఫెరల్ నెర్వస్ సిస్టం, సెంట్రల్ నెర్వస్ సిస్టం, కార్డియో వస్క్యులర్ సిస్టం, కీమోథెరఫీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ టాక్సికాలజీ...ఫార్మకాగ్నసీ: సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, రెసిన్స్, వొలాటైల్ ఆయిల్స్, ఫైటోకెమికల్ స్క్రీనింగ్, ఫైబర్స్...బయో ఫార్మాస్యూటిక్స్, ఫోరెన్సిక్ ఫార్మాసీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ తదితర అంశాలపై దృష్టి సారించాలి. ప్రిపరేషన్ టిప్స్ తొలుత బీఫార్మసీ పాఠ్యపుస్తకాల్లోని బేసిక్స్‌పై పట్టు సాధించాలి. తర్వాత అదనపు ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అప్లికేషన్స్‌ను నేర్చుకోవాలి. ఆయా అంశాల నుంచి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో గుర్తించటం ప్రధానం.మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్మెంట్ బేస్డ్ విధానంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. మోడల్ లేదా ప్రీవియస్ పేపర్లలోని ప్రశ్నలన్నింటినీ సాధించాలి. దీనివల్ల ప్రిపరేషన్లో బలాలు, బలహీనతలు తెలుస్తాయి.ప్రిపరేషన్ సమయంలో ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది రివిజన్‌కు ఉపయోగపడుతుంది. గ్రూప్ స్టడీ వల్ల ప్రయోజనం ఉంటుంది. క్లిష్టమైన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకునేందుకు, ఆయా అంశాలు బాగా గుర్తుండేందుకు గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. వేర్వేరు సబ్జెక్టులోని సారూప్య అంశాలను ఒకేసారి అధ్యయనం చేయాలి (ఉదాహరణకు ఫార్మకాలజీలోని ఏఎన్ఎస్, మెడిసినల్ కెమిస్ట్రీలోని ఏఎన్ఎస్..) టేబుల్స్‌ను రూపొందించుకోవటం ద్వారా ఫార్మకాగ్నసీలోని అంశాలపై తేలిగ్గా పట్టు సాధించవచ్చు. పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తున్నప్పటికీ, ప్రిపరేషన్ సమయంలో ప్రశ్నలకు సొంత పదాల్లో సమాధానాలు రాసేలా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల సబ్జెక్టు ఎంత వరకు అర్థమైందో తెలుస్తుంది. నిమోనిక్స్ సహాయంతో డ్రగ్స్, ఇన్‌గ్రేడియెంట్స్ పేర్లను గుర్తుపెట్టుకోవాలి. జీప్యాట్- ప్రయోజనాలు జీప్యాట్‌లో అర్హత సాధించడం ద్వారా బహుళ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అవి.. జీప్యాట్ స్కోర్ ఏడాది పాటు చెల్లుబాటవుతుంది. ఈ స్కోర్ ఆధారంగా అన్ని సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీల్లో ఫార్మసీ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం పొందొచ్చు.నిర్దేశించిన విధంగా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందితే నెలకు రూ.12,400 స్కాలర్షిప్ లభిస్తుంది.జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు-పీజీఈసెట్, మణిపాల్సెట్, బిట్స్-పీజీ, ఫార్మ్పీజీ (భారతీయ విద్యాపీఠ్), ప్రభుత్వ రంగంలో నిర్వహించే ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామకాలకు నిర్వహించే పరీక్షలు.జీప్యాట్ స్కోర్‌తో సీసీఎంబీ, సీడీఆర్ఐ వంటి పరిశోధన సంస్థల నుంచి ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ చేయవచ్చు. జీప్యాట్‌లో అర్హత సాధించడం ద్వారా ఉస్మానియా, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల నుంచి పార్ట్ టైం/ఫుల్ టైం పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. రిఫరెన్స్ ఫార్మాస్యూటిక్స్: ఔ్చఛిజిఝ్చ ఫార్మకాలజీ: Rang & Dale,K.D.Tripathi ఫార్మాస్యూటికల్ అనాలిసిస్: Remington, Pavia, Y.R.Sharma మెడిసినల్ కెమిస్ట్రీ: గిజీson and Grisvold, Foye, S.N.Pandeya ఫార్మకాగ్నసీ: Kokate, Trease & Evans, Khandelwal ప్రత్యేక ప్రణాళికతో సన్నద్ధత ఉండాలి గతంలో పోల్చితే జీప్యాట్ నోటిఫికేషన్ ముందుగా విడుదలైంది. జనవరిలోనే పరీక్ష పూర్తికావటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. దీనివల్ల అకడమిక్ థియరీ పరీక్షలు, నైపర్ జేఈఈలకు సన్నద్ధతకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఆయా పరీక్షలకు బాగా ప్రిపేర్ కావొచ్చు. జీప్యాట్‌లో ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. అందువల్ల ఈ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ ఫార్మసీకి సంబంధించిన ఇతర ప్రవేశ/పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఫార్మా కంపెనీల నియామకాల్లో జీప్యాట్ స్కోర్‌కు ప్రాధాన్యత లభిస్తోంది. అందువల్ల అభ్యర్థులు మెరుగైన స్కోర్ సాధనకు కృషి చేయాలి. మంచి స్కోర్ సాధించాలంటే ప్రధానంగా ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి. ‘ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఫార్మసీలో దాని ప్రాధాన్యం’ అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అందుబాటులో ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో సిలబస్‌ను పూర్తిచేసేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించుకోవాలి. రివిజన్‌కు తగిన సమయాన్ని కేటాయించాలి. జీప్యాట్, గేట్-ఫార్మసీ గత ప్రశ్నపత్రాలతో పాటు మోడల్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. ఫ్యాకల్టీ సహాయంతో ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే లక్ష్యానికి తగిన స్కోర్ సాధించవచ్చు. - ఎ.విజయేంద్ర చారి, మాస్టర్స్ ఫార్మసీ అకాడమీ, హైదరాబాద్. -
స్కోరు బాగుంటేనే ‘క్రెడిట్’
అప్పు కావాలంటే ఏ బ్యాంకయినా, ఆర్థిక సంస్థయినా చూసేది సిబిల్ స్కోరే. ఆ స్కోరు బాగుంటే ఓకే. లేదంటే రుణం చేతిదాకా వచ్చి ఆగిపోతుంటుంది. అందుకే ఆ స్కోరును ఎలా మెరుగుపరచుకోవాలనేది ‘సాక్షి’కి ప్రత్యేకంగా వివరించారు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్షలా చందోర్కర్. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... * రుణాల వాయిదాల చెల్లింపుల్లో జాగ్రత్త * ఆలస్యం, చెల్లించకపోవటం మొదటికే మోసం * ఎడాపెడా లోన్లకు దరఖాస్తులు చేసినా నష్టమే * దరఖాస్తుకు ముందు స్కోరు చూసుకోవటం బెటర్ ఈ దసరా పండుగకి మాంచి ఎల్ఈడీ టీవీ తీసుకుందామనుకున్నారు కొత్త జంట ఆనంద్, రాధ. ఇద్దరూ కలసి ఇంటికి దగ్గర్లోని ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌కి వెళ్లి అన్ని బ్రాండ్స్‌ను చూశారు. ఒకటి నచ్చింది. తీరా రేటు చూశాక తెలిసింది. అది వారి బడ్జెట్‌ను మించిపోయిందని. ఇద్దరూ కాస్త నిరాశపడి... మరికొంత పొదుపు చేశాక కొందాంలే అనుకుంటూ వెనుదిరిగారు. అక్కడితో అయిపోలేదు కథ. విషయం తెలుసుకున్న సేల్స్‌పర్సన్ వారిద్దరినీ ఆపాడు. వారు కోరుకునే ప్రోడక్టును కొనుక్కునేందుకు ఫైనాన్సింగ్ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పాడు. అంతేగాకుండా స్టోర్‌లోనే ఉన్న ఫైనాన్సింగ్ కంపెనీ ప్రతినిధిని వారికి పరిచయం కూడా చేశాడు. ఎల్ఈడీ టీవీ కొనుగోలుకు సరిపడేంత లోన్ తక్షణమే పొందే వీలుందని తెలియడంతో ఆనంద్, రాధ ఊపిరి పీల్చుకున్నారు. లోన్ అప్లికేషన్ ఫారంను ఆనంద్ చకచకా నింపేశాడు. ఆ ప్రతినిధి అడిగిన వివరాలు, ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాడు. వాటి ఆధారంగా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి అప్పటికప్పుడు ఆనంద్ క్రెడిట్ స్కోరు, క్రెడిట్ హిస్టరీని ఆన్లైన్లో పరిశీలించాడు. ఆనంద్ క్రెడిట్ స్కోరు రుణం ఇవ్వతగిన స్థాయిలో ఉందని ధ్రువీకరించుకుని, లోన్‌ను ప్రాసెస్ చేశాడు. అలా ఆనంద్, రాధ తాము కోరుకున్న ఎల్ఈడీని కొనుక్కోగలిగారు. చిరుద్యోగి అయినప్పటికీ... ఆనంద్ చేసేది చిరుద్యోగమే. అయినప్పటికీ తనకు మంచి క్రెడిట్ స్కోరు ఉండటంతో లోన్ ఈజీగా మంజూరయింది. క్రెడిట్ కార్డులు, హోమ్ లోన్లు మొదలైనవి తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోరు అవసరమని ఆనంద్కి కొంత ఐడియా ఉన్నప్పటికీ.. దాని ప్రాధాన్యం మాత్రం అప్పుడే తెలిసింది. ఎంతో ఇష్టపడిన టీవీ కోసం మరో ఏడాది ఆగకుండా అప్పటికప్పుడు తీసుకోవడానికి తన క్రెడిట్ స్కోరే ఉపయోగపడిందని అర్థమైంది.దీంతో ఆనంద్, రాధ.. ఆర్థిక క్రమశిక్షణ ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు. క్రెడిట్ హిస్టరీ మెరుగ్గా ఉండటానికి తమంతట తాము కొన్ని నిబంధనలు విధించుకున్నారు. ఇవి వాళ్లిద్దరే కాదు. అందరూ పాటించదగ్గవే. అవేమిటంటే... ఎడాపెడా దరఖాస్తులు... అప్పుడప్పుడు మీకు బ్యాంకుల్లోను, ఇతర ప్రాంతాల్లోను క్రెడిట్ కార్డు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తారసపడుతుంటారు. తమ కంపెనీ క్రెడిట్ కార్డు ఇస్తామని, వాటి వల్ల చాలా లాభాలున్నాయని చెబుతారు. కంపెనీ ప్రతినిధే ఇస్తామంటున్నాడు కదా పోయేదేముందని మీరొక దరఖాస్తు పడేస్తారు. అడిగిన ద్రువపత్రాలన్నీ ఇస్తారు. తను కూడా అప్లయ్ చేస్తాడు. కాకపోతే మీ క్రెడిట్ స్కోరు సరిగా లేకుంటే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. సరే! జిరాక్స్ కాపీలిచ్చాం... అంతేకదా! అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఇలా ఎన్ని దరఖాస్తులు రిజక్ట్ అయితే అంత క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందన్న మాట. ఇలా ఐదారు దరఖాస్తులు తిరస్కరణకు గురైతే క్రెడిట్ స్కోరు దారుణంగా పడిపోతుందని గుర్తుంచుకోవాలి. అందుకే రుణాలకు గానీ, క్రెడిట్ కార్డులకు గానీ అవసరం లేకుండా ఎడాపెడా దరఖాస్తులు చెయ్యొద్దు. ఎప్పటికప్పుడు సమీక్ష.. అందుకే క్రెడిట్ కార్డు, రుణాలు మొదలైన వాటికి దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి క్రెడిట్ స్కోరు, హిస్టరీ చూసుకోవడం మంచిది. ఇవి బాగున్నాయంటే మన దరఖాస్తులు సక్రమంగా ప్రాసెస్ అవుతాయి. ఒకవేళ లోటుపాట్లేమైనా ఉంటే స్కోరు మెరుగుపర్చుకోటానికి తగు చర్యలు తీసుకోవచ్చు. ఆ తర్వాత సులభంగా లోన్ దొరుకుతుంది. కాబట్టి ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే... క్రెడిట్ స్కోరు వివరాలతోనే మన ఆర్థిక క్రమశిక్షణపై ఫైనాన్సింగ్ సంస్థలు ఒక అంచనాకు వస్తాయి. ఇది బాగుంటేనే రుణమూ, క్రెడిట్ కార్డూ లాంటివి తీసుకోవడం వీలవుతుంది. కనుక..క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి. ఇతరుల రుణాలకు హామీ ఇస్తే.. ఒకోసారి ఇతరులు తీసుకునే రుణాలకు మనం పూచీకత్తు ఇస్తుంటాం. అలాంటప్పుడు... ఆ లోన్ తీసుకున్న వారు ఎగ్గొట్టకుండా సరిగ్గా కడుతున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అప్పు తీసుకున్న వారు సరిగ్గా కట్టకపోయినా లేదా ఎగ్గొట్టినా... దానికి పూచీకత్తునిచ్చిన గ్యారంటార్ క్రెడిట్ హిస్టరీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. పేమెంట్ అలర్టులు... క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు గడువు తేదీని ఒకోసారి మర్చిపోయే అవకాశముంది. ఇది తరచూ జరిగితే ఆర్థికంగా అదన పు భారం పడటంతో పాటు క్రెడిట్ హిస్టరీ కూడా దెబ్బతింటుంది. కనుక, ఇలా జరగకుండా ఫోన్లో లేదా ఈ-మెయిల్లో అలర్ట్‌లు పెట్టుకుంటే మంచిది. అంతేకాక చెల్లింపులకు చివరి రోజు వరకూ ఆగొద్దు. ముందే చెల్లిస్తే మంచిది. సకాలంలో చెల్లింపులు.. క్రెడిట్ కార్డులపై వాడిన మొత్తాలు కావొచ్చు, లేదా ఇతరత్రా ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలు కావొచ్చు... ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐలను ఎప్పుడూ ఆలస్యం చేయొద్దు. వాయిదాలు కూడా వేయొద్దు. సకాలంలో చెల్లించేయాలి.