జీప్యాట్‌లో మెరుగైన స్కోర్‌కు మార్గాలు... | Jipyatlo better ways to score ... | Sakshi
Sakshi News home page

జీప్యాట్‌లో మెరుగైన స్కోర్‌కు మార్గాలు...

Published Wed, Nov 18 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

Jipyatlo better ways to score ...

సిలబస్
 జీప్యాట్‌లో మంచి స్కోర్ సాధించాలంటే ప్రధానంగా ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి.ఫార్మాస్యూటిక్స్: ఇంట్రడక్షన్ టు ఫిజికల్ ఫార్మసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇన్ ఫార్మసీ, ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ జ్యూరిస్‌ప్రుడెన్స్ అండ్ ఎథిక్స్, ఇంట్రడక్షన్ టు డిస్పెన్సింగ్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ..ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఇనార్గానిక్ ఫార్మాస్యూటికల్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇన్ ఫార్మసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ..
 
 ఫార్మాస్యూటికల్ అనాలిసిస్: టెక్నిక్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, టైట్రేషన్స్, ఎక్స్‌ట్రాక్షన్ ప్రొసీజర్స్, క్రొమటోగ్రఫీ, క్వాలిటీ అస్యూరెన్స్..ఫార్మకాలజీ: పాథో ఫిజియాలజీ ఆఫ్ కామన్ డిసీజెస్, ఇమ్యూనో పాథోఫిజియాలజీ, జనరల్ ఫార్మకాలజీ, ఫార్మకాలజీ (పెరిఫెరల్ నెర్వస్ సిస్టం, సెంట్రల్ నెర్వస్ సిస్టం, కార్డియో వస్క్యులర్ సిస్టం, కీమోథెరఫీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ టాక్సికాలజీ...ఫార్మకాగ్నసీ: సోర్సెస్ ఆఫ్ డ్రగ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, రెసిన్స్, వొలాటైల్ ఆయిల్స్, ఫైటోకెమికల్ స్క్రీనింగ్, ఫైబర్స్...బయో ఫార్మాస్యూటిక్స్, ఫోరెన్సిక్ ఫార్మాసీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ తదితర అంశాలపై దృష్టి సారించాలి.
 
 ప్రిపరేషన్ టిప్స్
 తొలుత బీఫార్మసీ పాఠ్యపుస్తకాల్లోని బేసిక్స్‌పై పట్టు సాధించాలి. తర్వాత అదనపు ప్రామాణిక మెటీరియల్‌ను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అప్లికేషన్స్‌ను నేర్చుకోవాలి. ఆయా అంశాల నుంచి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో గుర్తించటం ప్రధానం.మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్‌మెంట్ బేస్డ్ విధానంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. మోడల్ లేదా ప్రీవియస్ పేపర్లలోని ప్రశ్నలన్నింటినీ సాధించాలి. దీనివల్ల ప్రిపరేషన్‌లో బలాలు, బలహీనతలు తెలుస్తాయి.ప్రిపరేషన్ సమయంలో ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
 
 గ్రూప్ స్టడీ వల్ల ప్రయోజనం ఉంటుంది. క్లిష్టమైన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకునేందుకు, ఆయా అంశాలు బాగా గుర్తుండేందుకు గ్రూప్ స్టడీ ఉపయోగపడుతుంది. వేర్వేరు సబ్జెక్టులోని సారూప్య అంశాలను ఒకేసారి అధ్యయనం చేయాలి (ఉదాహరణకు ఫార్మకాలజీలోని ఏఎన్‌ఎస్, మెడిసినల్ కెమిస్ట్రీలోని ఏఎన్‌ఎస్..)
 టేబుల్స్‌ను రూపొందించుకోవటం ద్వారా ఫార్మకాగ్నసీలోని అంశాలపై తేలిగ్గా పట్టు సాధించవచ్చు.
 పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తున్నప్పటికీ, ప్రిపరేషన్ సమయంలో ప్రశ్నలకు సొంత పదాల్లో సమాధానాలు రాసేలా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల సబ్జెక్టు ఎంత వరకు అర్థమైందో తెలుస్తుంది.
 నిమోనిక్స్ సహాయంతో డ్రగ్స్, ఇన్‌గ్రేడియెంట్స్ పేర్లను గుర్తుపెట్టుకోవాలి.
 
 జీప్యాట్- ప్రయోజనాలు
 జీప్యాట్‌లో అర్హత సాధించడం ద్వారా బహుళ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అవి..
 జీప్యాట్ స్కోర్ ఏడాది పాటు చెల్లుబాటవుతుంది. ఈ స్కోర్ ఆధారంగా అన్ని సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీల్లో ఫార్మసీ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశం పొందొచ్చు.నిర్దేశించిన విధంగా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందితే నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్ లభిస్తుంది.జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు-పీజీఈసెట్, మణిపాల్‌సెట్, బిట్స్-పీజీ, ఫార్మ్‌పీజీ (భారతీయ విద్యాపీఠ్), ప్రభుత్వ రంగంలో నిర్వహించే ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నియామకాలకు నిర్వహించే పరీక్షలు.జీప్యాట్ స్కోర్‌తో సీసీఎంబీ, సీడీఆర్‌ఐ వంటి పరిశోధన సంస్థల నుంచి ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ చేయవచ్చు.
 జీప్యాట్‌లో అర్హత సాధించడం ద్వారా ఉస్మానియా, జేఎన్‌టీయూ వంటి యూనివర్సిటీల నుంచి పార్ట్ టైం/ఫుల్ టైం పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు.
 
 రిఫరెన్స్
 ఫార్మాస్యూటిక్స్: ఔ్చఛిజిఝ్చ
 ఫార్మకాలజీ: Rang & Dale,K.D.Tripathi
 ఫార్మాస్యూటికల్ అనాలిసిస్:
 Remington, Pavia, Y.R.Sharma
 మెడిసినల్ కెమిస్ట్రీ: గిజీson and Grisvold, Foye, S.N.Pandeya
 ఫార్మకాగ్నసీ: Kokate, Trease & Evans, Khandelwal
 
 ప్రత్యేక ప్రణాళికతో సన్నద్ధత ఉండాలి
 గతంలో పోల్చితే జీప్యాట్ నోటిఫికేషన్ ముందుగా విడుదలైంది. జనవరిలోనే పరీక్ష పూర్తికావటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. దీనివల్ల అకడమిక్ థియరీ పరీక్షలు, నైపర్ జేఈఈలకు సన్నద్ధతకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఆయా పరీక్షలకు బాగా ప్రిపేర్ కావొచ్చు. జీప్యాట్‌లో ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి. అందువల్ల ఈ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ ఫార్మసీకి సంబంధించిన ఇతర ప్రవేశ/పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఫార్మా కంపెనీల నియామకాల్లో జీప్యాట్ స్కోర్‌కు ప్రాధాన్యత లభిస్తోంది. అందువల్ల అభ్యర్థులు మెరుగైన స్కోర్ సాధనకు కృషి చేయాలి.
 
  మంచి స్కోర్ సాధించాలంటే ప్రధానంగా ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలపై పట్టు సాధించాలి. ‘ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఫార్మసీలో దాని ప్రాధాన్యం’ అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అందుబాటులో ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో సిలబస్‌ను పూర్తిచేసేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించుకోవాలి. రివిజన్‌కు తగిన సమయాన్ని కేటాయించాలి. జీప్యాట్, గేట్-ఫార్మసీ గత ప్రశ్నపత్రాలతో పాటు మోడల్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. ఫ్యాకల్టీ సహాయంతో ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ, తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే లక్ష్యానికి తగిన స్కోర్ సాధించవచ్చు.
 - ఎ.విజయేంద్ర చారి,
 మాస్టర్స్ ఫార్మసీ అకాడమీ, హైదరాబాద్.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement