రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే న్యూ భారత్ ఎన్‌సీఏపీ (Bharat NCAP) నిబంధనలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నియమాలు 2023 అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానున్నాయి. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ అనేది దాదాపు గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని వ్యత్యాసాలను గమనించవచ్చు.
గ్లోబల్ ఎన్‌సీఏపీ కింద, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో వాహనం గరిష్టంగా 34 పాయింట్లు స్కోర్ చేయగలదు. కానీ భారత్ ఎన్‌సీఏపీ కింద 32 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రెండు టెస్టింగ్ ప్రోటోకాల్‌లు ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం ఒక్కొక్కటి 16 పాయింట్‌లను అందిస్తాయి.
భారత్ ఎన్‌సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ పొందాలంటే ఎంత స్కోర్ చేయాలి? ఎంత స్కోర్ చేస్తే 1 స్టార్ రేటింగ్ లభిస్తుందనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రెంట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు!
- ఒక కారు భారత్ ఎన్‌సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకోవాలంటే.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 41 పాయింట్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది.
- అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 22 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 35 పాయింట్లు స్కోర్ చేస్తే 4 స్టార్ రేటింగ్ లభిస్తుంది.
- చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 16 పాయింట్లు సాధిస్తే 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది.
- అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో వరుసగా 10, 4 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 18, 9 పాయింట్లు స్కోర్ చేస్తే 2 స్టార్ రేటింగ్ & 1 స్టార్ రేటింగ్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment