‘బుట్టబొమ్మ’ మరో సెన్సేషనల్‌ వీడియో | Indigo Staff steal the hearts with song of Tollywood Butta Bomma | Sakshi
Sakshi News home page

‘బుట్టబొమ్మ’ మరో సెన్సేషనల్‌ వీడియో

Jul 21 2020 6:01 PM | Updated on Jul 21 2020 6:48 PM

Indigo Staff steal the hearts with song of Tollywood Butta Bomma - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: సెలబ్రిటీలనుంచి పసిపాపల దాకా భారీ క్రేజ్‌  కొట్టేసిన "బుట్టబొమ్మా" పాట గురించి తెలియని వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీలోని ఈ  పాట  చిన్నా పెద్ద  దాదాపు అందరితోనూ స్టెప్పు లేయించింది.  

మ్యూజిక్‌ చార్ట్‌లో టాప్‌లో దూసుకుపోతున్న బుట్టబొమ్మకు తాజాగా ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగులు కూడా ఫిదా అయిపోయారు. వైజాగ్‌లోని ఇండిగో సిబ్బంది స్టైలిష్‌ స్టార్‌ బుట్టబొమ్మ పాటకు అద్భుతమైన స్టెప్పులతో ఇరగదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై హీరో అల్లు అర్జున్‌ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు గ్రేట్‌ సాంగ్‌, గ్రేట్‌ ఎనర్జీ అంటూ ఈ వీడియోను డేవిడ్‌ వార్నర్‌ రీట్వీట్‌ చేయడం మరో విశేషం.  

కాగా తమన్‌ స్వరాలందించగా​, త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ పాట 200 మిలియన్లకుపైగా వ్యూస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. ముఖ్యంగా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో కూడా ఈ బుట్టబొమ‍్మ డ్యాన్స్‌ చేయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement