‘బుట్టబొమ్మా’కు ఫ్యాన్స్‌ ఫిదా  | telugu stylish star Allu Arjun  second song from ala vaikunthapuram lo | Sakshi
Sakshi News home page

‘బుట్టబొమ్మా’కు ఫ్యాన్స్‌ ఫిదా 

Published Tue, Dec 24 2019 5:14 PM | Last Updated on Tue, Dec 24 2019 6:42 PM

telugu stylish star Allu Arjun  second song from ala vaikunthapuram lo - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాబోవు చిత్రం అల వైకుంఠపురంలో మరో పాట ఈ రోజు (మంగళవారం) సాయంత్రం విడుదలైంది. దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే' పూర్తి పాట ఇపుడు హల్‌ చల్‌ చేస్తోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లో ఈ లిరికల్‌ వీడియో దాదాపు 5లక్షల వ్యూస్‌కు దగ్గరిలో వుంది. ఇప్పటికే  రాములో రాములా పాట రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. 

‘బుట్టబొమ్మా’ పాటను యువ గాయకుడు 'అర్మాన్ మాలిక్' అద్భుతంగా ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీత దర్శకుడు తమన్ స్వరాలు కూర్చారు. ఆకట్టుకునే ట్యూన్‌తో తమన్‌ మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరిస్తూ, ఈ చిత్రం నుంచి విడుదలైన గీతాల రికార్డుల సరసన చేరే దిశగా దూసుకు పోతోంది.

గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల అవుతోంది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement