గ్రాండ్‌గా రిలీజైన షెహజాదా.. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ! | Shehzada Movie: Buy One Get One Free Ticket For Kartik Aryan Movie | Sakshi
Sakshi News home page

Shehzada: 'అల' రీమేక్‌.. ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ.. మరీ మొదటిరోజేనా?

Published Fri, Feb 17 2023 11:59 AM | Last Updated on Fri, Feb 17 2023 12:11 PM

Shehzada Movie: Buy One Get One Free Ticket For Kartik Aryan Movie - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురములో. 2020 జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌, తమన్‌ సంగీతం, పిఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ బాక్సాఫీస్‌ హిట్‌ మీద కన్నుపడ్డ బాలీవుడ్‌ షెహజాదా పేరుతో రీమేక్‌ చేసింది. కార్తీక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 17) రిలీజైంది. అయితే విచిత్రంగా మొదటి రోజే వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ ప్రకటించారు నిర్మాతలు. బుక్‌మై షోలో ఒక టికెట్‌ కొంటే మరొక టికెట్‌ ఉచితమని వెల్లడించారు. ఇలా ఆఫర్‌ ప్రకటించేందుకు కారణం లేకపోలేదు.

షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ సినిమాకు దేశవ్యాప్తంగా టికెట్‌ రేట్లు తగ్గించారు. రూ.110 కే టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పఠాన్‌ పోటీని తట్టుకోవడానికి వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరీ సినిమా రిలీజైన మొదటి రోజే ఇలాంటి ఆఫర్‌ పెట్టడం బాగోలేదంటున్నారు నెటిజన్లు. మరోపక్క సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్‌ పండితులు. మరి షెషజాదా ఈ అడ్డంకులను దాటి ఏమేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి!

చదవండి: సింపుల్‌గా ఉపాసన సీమంతం, ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement