ఈ క్రేజ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు! | Thaman Retweets Butta Bomma Song Dance Video By Children | Sakshi
Sakshi News home page

ఈ క్రేజ్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు!

Published Sat, Mar 14 2020 9:06 PM | Last Updated on Sat, Mar 14 2020 9:27 PM

Thaman Retweets Butta Bomma Song Dance Video By Children - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ సంక్రాంతికి విడులైన ‘అల వైకుంఠపురంలో’ భారీ విజయం సాధించింది. ఇందులోని పాటలు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ పాటలు వ్యూయర్‌షిప్‌ పరంగా పలు రికార్డులు నమోదు చేశాయి. తమన్‌ అద్భుతమైన సంగీతం, బన్ని, పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో పాటలు అలరిస్తాయి. 

ఇక ‘అల వైకుంఠపురంలో’ పాటలకు ఫ్యాన్స్‌ వేసే సెప్పులు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సందర్భాలున్నాయి. తాజాగా, బుట్టబొమ్మ పాటకు రణస్థలానికి చెందిన కొంతమంది చిన్నారులు వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బుట్టబొమ్మ పాటకు మా రణస్థలం పిల్లలు డాన్స్‌. ఈ పాటకు ఇప్పట్లో క్రేజ్‌ తగ్గేలా లేదు. ఎప్పుడూ గుర్తుండే పాట. అద్భుతమైన సంగీతం అందించిన తమన్‌కు థాంక్స్‌’ అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేయగా.. ‘డాన్స్‌ బాగా చేశారు. బుట్టబొమ్మ ఒక సెన్సేషన్‌’ అంటూ తమన్‌ రీట్వీట్‌ చేశాడు. ఈపాటను రామజోగయ్య శాస్త్రి రాయగా..అర్మన్‌ మాలిక్‌ ఆలపించాడు. దీంతోపాటు సామజవరగమన పాటను ఇద్దరు చిన్నారులు పాడిన తీరుకు తమన్‌ ఫిదా ​అయ్యారు. ఆ వీడియోను షేర్‌ చేయడంతో వైరల్‌ అయింది. ఇలాంటి క్యూటెస్ట్‌ పిల్లల్ని చూడలేదని తమన్‌ శుక్రవారం చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement