
అల్లు అర్జున్
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల... వైకుంఠపురములో..’. ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన ‘సామజ వరగమన, రాములో రాములా’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘ఓ మై గాడ్.. డాడీ’ అనే మరో పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను కృష్ణచైతన్య రాశారు. తమన్ సంగీతం అందించారు. ఈ పాటలోని తెలుగు ర్యాప్‌ను ‘బిగ్ బాస్’ ఫేమ్ రోల్ రైడా, ఇంగ్లీస్ ర్యాప్‌ని రాహుల్ నంబియార్ పాడారు. ఫిమేల్ ర్యాప్‌ను లేడీ కాష్ ఆలపించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. బ్లాజీ గొంతు కలిపారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.
పోటీ లేదు: మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో..’ చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 12నే విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ తెలుగు సినిమా ఈ విషయంలో చొరవ తీసుకుని రెండు సినిమాల నిర్మాతలతో మాట్లాడింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఒక రోజు ముందుగా అంటే జనవరి 11న విడుదల చేయనున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ‘అల.. వైకుంఠపురములో..’ 12న విడుదలవుతుంది. దీంతో ఓపెనింగ్స్, థియేటర్ల సంఖ్యపై ప్రభావం పడదు.