అల్లు అర్జున్, కూతురు అర్హల సరదా వీడియోని పోస్ట్ చేసిన స్నేహారెడ్డి | Alluarjun Making Fun with Arha On Ramulo Ramula Song - Sakshi
Sakshi News home page

అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’​

Published Fri, Jan 3 2020 1:02 PM | Last Updated on Fri, Jan 3 2020 1:43 PM

Allu Arjun Fun With Arha About Ramulo Ramula Song - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీకి సంబంధించిన పలు విశేషాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటారు. బన్నీ కొత్త చిత్రం అల.. వైకుంఠపురములో.. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి.. బన్నీ తన కుమార్తె అర్హతో జరిపిన సంభాషణ వీడియోను స్నేహ శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో ఈ చిత్రంలోని ‘రాములో.. రాములా’ సాంగ్‌లో స్టెప్పులంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన అర్హ.. ముఖ్యంగా దోశ స్టెప్పు అంటూ.. నవ్వులు పూయిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు విశేషమైన స్పందన వస్తుంది. అందులో ‘రాములో.. రాములా’ సాంగ్‌లో బన్నీ వేసిన స్టెప్పులు థియేటర్లలో తప్పకుండా విజిల్స్‌ వేయిస్తానడంలో సందేహాం లేదు. గతంలో ‘ఓ మై గాడ్‌ డాడీ’ సాంగ్‌పై అర్హ, ఆయాన్‌ల వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

బన్నీ : నాన్న సినిమా పేరేంటి?
అర్హ :  అల.. వైకుంఠపురములో..
బన్నీ : అందులో నాన్న ఎల్లో కలర్‌ జాకెట్‌ వేసుకుని సాంగ్‌ చేస్తాడు కదా.. అది ఏ సాంగ్‌?
అర్హ : రాములో.. రాములా
బన్నీ : ఆ రాములో.. రాములా. అందులో ఏ స్టెప్పు చేస్తాను
అర్హ : దోశ స్టెప్పు
బన్నీ : హే స్టెప్పు(నవ్వుతూ..)
అర్హ : దోశ స్టెప్పు
బన్నీ : (ఆయాన్ పిలుస్తుంటే) హూష్‌ ఆగు.. కాదు దోశ స్టెప్పు వేయి ఒకసారి
అర్హ : ఇలా మొత్తం తిప్పి.. ఫాస్ట్‌గా తిప్పుతావు.

కాగా, ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే కథనాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. టబు, రాజేంద్రప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement