Allu Arjun Guest Role In Ala Vaikunthapurramuloo Hindi Remake - Sakshi
Sakshi News home page

'అల.. వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో బన్నీ!

Published Mon, Jul 19 2021 8:23 AM | Last Updated on Mon, Jul 19 2021 10:44 AM

Allu Arjun In Hindi Remake Of Ala Vaikunthapurramuloo As a Guest Role - Sakshi

అల్లు అర్జున్‌కి దక్షిణాదిలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన స్టైలిష్‌ లుక్స్, నటనతో సౌత్‌ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా ‘అల.. వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌తో అని సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని ‘షాజాదే’ (యువరాజు) పేరుతో హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. కార్తీక్‌ ఆర్యన్, కృతీ సనన్‌ జంటగా రోహిత్‌ ధావన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పరేశ్‌ రావల్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అతిథి పాత్ర చేయాలని అల్లు అర్జున్‌ని చిత్రవర్గాలు కోరగా, ఆయన పచ్చజెండా ఊపారని టాక్‌. తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ అతిథి పాత్ర లేదు. మరి ‘షాజాదే’లో అతిథి పాత్రను జోడించి ఉంటారా? ఉంటే.. ఆ పాత్రను అల్లు అర్జున్‌ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement