
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రానికి అవార్డుల పంట కురిసింది. బాలీవుడ్ లైఫ్.కామ్ 2021 అవార్డుల జాబితాలో అన్ని కేటగిరీల్లోనూ అల వైకుంఠపురములో మూవీ రికార్డులు సృష్టించింది. సౌత్ మూవీస్ కెటగిరీలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఉత్తమ డైరెక్టర్ అవార్డు వరించింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ నిలిచారు. వీటితోపాటు బెస్ట్ సాంగ్, రాములో రాములో, బెస్ట్ సపోర్టింగ్ రోల్-సుశాంత్, బెస్ట్ సినిమాటోగ్రఫీ- పీఎస్ వినోద్, బెస్ట్ స్క్రిప్ట్ వంటి రంగాల్లో అవార్డులు దక్కాయి. ఒక హీరోయిన్ తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అల వైకుంఠపురములో సినిమా క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక భీష్మ సినిమాకు రష్మిక మందనా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.
కాగా కరోనా కారణంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. బాలీవుడ్, సౌత్ సినిమా, భోజ్ పురి, ఓటీటీ వంటి పలు క్యాటగిరిల్లో 60కి పైగా అవార్డులు ఇచ్చారు. విన్నర్స్‌తో లైవ్ స్ట్రీమింగ్‌లో మాట్లాడుతూ పురస్కారాలు అందించారు. మరోవైపు బాలీవుడ్‌లో రణవీర్ సింగ్, దీపిక పదుకొణే, రాజ్ కుమార్ రావ్, నోరా ఫతేహి లాంటి వారికి అవార్డులు వరించాయి. ఓటీటీ క్యాటగిరిలో పలు వెబ్ సిరీస్ లకుగానూ అర్షద్ వార్సీ, హన్సల్ మెహతా, నీనా గుప్తా, బాబీ డియోల్ వంటి వారు బాలీవుడ్ లైఫ్ డాట్ కామ్ అవార్డ్స్ పొందారు.
చదవండి: అల్లు అర్జున్ థియేటర్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా
.










Comments
Please login to add a commentAdd a comment