![Saranga Dariya Song Broke Records Set By Ala Vaikuntapuramlo Songs - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/15/18.jpg.webp?itok=cBZZi7rL)
జానపదానికి మెరుగులు అద్ది అందించిన పాట 'సారంగదరియా..'. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన చరణాలను మంగ్లీ తన గాత్రంతో మరింత మనోహరంగా మలిచింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరేటి స్టెప్పులేసిన సాయి పల్లవి ఓరకంగా నెమలి నాట్యాన్ని ప్రేక్షకులకు చూపించింది. ఓ పక్క ఈ పాటను వివాదాలు చుట్టుముట్టినప్పటికీ జనాలు మాత్రం దానికి అడిక్ట్ అయిపోయారు. ఇక రెండు వారాల కిందట రిలీజైన ఈ సాంగ్ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
అక్కినేని సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు దాటి 'అల వైకుంఠపురం' పేరిట ఉన్న పాటల రికార్డును తిరగరాసింది. 50 మిలియన్ల వ్యూస్ మార్క్‌ను చేరుకునేందుకు 'బుట్ట బొమ్మ..' పాటకు 18 రోజులు పట్టగా రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది. కానీ 'సారంగదరియా..' మాత్రం జస్ట్ 14 రోజుల్లోనే ఆ రికార్డును అందుకోవడం విశేషం.
కాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమే ‘లవ్ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment