శ్రేయ గోషాల్ నోట సామజవరగమనా కవర్ సాంగ్ | 'Samajavaragamana' Female Cover Song by Shreya Goshal - Sakshi
Sakshi News home page

ఆమె నోట ‘సామజవరగమన’

Published Sat, Jan 4 2020 5:31 PM | Last Updated on Sat, Jan 4 2020 6:01 PM

Samajavaragamana Song Female Cover By Shreya Ghoshal Ala Vaikunthapurramuloo - Sakshi

ఈ మధ్య కాలంలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన సాంగ్‌ ‘సామజవరగమన’.. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. కెరీ​ర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న తమన్‌ ఈ పాటను కంపోజ్‌ చేశాడు. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌గా వచ్చిన ‘సామజవరగమన’అంటూ వచ్చిన లిరికల్‌ సాంగ్‌  సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ట్రెంట్‌ సెట్టర్‌గా నిలిచి రికార్డులు కొల్లగొట్టింది. అంతేకాకుండా న్యూఇయర్‌ కానుకగా వచ్చిన ఈ పాట వీడియో సాంగ్‌ను కూడా సినీ ప్రేక్షకులు తెగ లైక్‌ చేసేస్తున్నారు. 

అయితే ఈ పాటకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సెన్సేషనల్‌ సాంగ్‌ ఫీమేల్‌ కవర్‌ను ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్‌ పాడారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఫీమేల్‌ వర్షన్‌లో శ్రేయా ఘోషాల్‌ పాడుతున్న ఈ పాటను నెటిజన్లను కట్టిపడేస్తోంది. అయితే ఫీమేల్‌ వర్షన్‌ ఈ పాటకు కాస్త డిఫరెంట్‌గా ట్యూన్‌ కట్టిన తమన్‌.. బేస్‌ కూడా తగ్గించాడు. అయితే కొత్తగా, అందంగా తయారైన ‘సామజవరగమన’ ఫీమేల్‌ కవర్‌ సాంగ్‌ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. సింగింగ్‌ క్వీన్‌ శ్రేయా ఘోషాల్‌ ‘సామజరవగమన’ పాడటంతో ఆ పాటకు మరింత అందం వచ్చిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  

ఇక ‘జులాయి (2012), సన్నాఫ్‌ సత్యమూర్తి (2015)’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి కూడా యు/ఎ సర్టిఫికెట్‌ లభించింది. కాగా, ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ (మ్యూజికల్‌ కన్సెర్ట్‌) ఈవెంట్‌ జనవరి 6న హైదరాబాద్‌లో జరగనుంది.

చదవండి:
ష్‌.. ఎవరికీ చెప్పకండి: పూజా హెగ్డే
నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement