‘ఓ మై గాడ్‌’ అనిపిస్తున్న బన్నీ పాట | Ala Vaikunthapurramuloo Third Song Teaser Released | Sakshi
Sakshi News home page

బన్నీపై పిల్లల కంప్లైంట్‌

Published Thu, Nov 14 2019 12:06 PM | Last Updated on Thu, Nov 14 2019 4:28 PM

Ala Vaikunthapurramuloo Third Song Teaser Released - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాయి. మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తూ పలు రికార్డులను తిరగరాస్తున్నాయి. అయితే వాటికి పోటీగా ఇప్పుడు మరో పాట ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన సాంగ్‌ టీజర్‌ను బాలల దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కనిపించిన ప్రత్యేక అతిథులను చూసి బన్నీ అభిమానులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఈ పాటను బన్నీ కుమారుడు అయాన్‌, కూతురు అర్హలతో మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘ఓ మై గాడ్‌ డాడీ..’ అంటూ సాగే పాటలో అయాన్‌ అచ్చం తండ్రిలానే స్టెప్పులేయడానికి ప్రయత్నించడం అందరినీ ఆకర్షిస్తోంది.

తండ్రికి తగ్గ తనయుడు అంటూ అయాన్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు బన్నీ ఫ్యాన్స్‌. మరోవైపు కూతురు అర్హ కూడా ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో పడేసింది. ఈ పాటలో అల్లు అర్జున్‌ పోస్టర్ ముందు ఇద్దరు చిన్నారులు నెత్తిన చేయి పెట్టుకుని పెర్ఫార్మ్‌ చేయడం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పాటకు తమన్‌ సంగీతాన్ని చేకూర్చగా కృష్ణ చైతన్య లిరిక్స్‌ అందించాడు. రోల్‌ రీడా, రాహుల్‌ సిప్లిగంజ్‌, రాహుల్‌ నంబియార్‌, రాబిట్‌ మ్యాక్‌, బ్లెజీ పాడారు. పూర్తి పాటను నవంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాసేపటి క్రితమే విడుదలైన ‘ఓమైగాడ్‌’ సాంగ్‌ టీజర్‌ ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డులను తిరగరాసే దిశగా దూసుకపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement