బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి! | Vijay Sethupathi To Play Villain role In Allu Arjun Film With Sukumar | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమాలో విలన్‌గా విజయ్‌ సేతుపతి

Published Tue, Oct 29 2019 12:23 PM | Last Updated on Tue, Oct 29 2019 2:17 PM

Vijay Sethupathi To Play Villain role In Allu Arjun Film With Sukumar - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘అల వైకుంఠపురంలో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలై యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తుండటంతో సినిమాపై అభిమానులు ఓ రేంజ్‌లో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంటుండగానే బన్నీ... క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మూవీ అల్లు అర్జున్‌కు 20వ చిత్రం కావడంతో  చిత్ర యూనిట్‌ AA#20 వర్కింగ్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఆర్య, ఆర్య-2 సినిమాలు రాగా ఇది హ్యట్రిక్‌ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోనున్నట్లు సమాచారం.

తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ సినిమాలో నటించిన అతిథి పాత్రతో విజయ్‌ సేతుపతి టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విజయ్‌కు తెలుగులో భారీగానే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి తెలుగులో ఇప్పటికే ‘ఉప్పెన’ అనే సినిమా చేయడానికి అంగీకరించారు.  ఇక దర్శకుడు సుకుమార్‌ బన్నీ సినిమా కోసం తనను సంప్రదించినట్లు, కథ నచ్చడంతో మూవీలో వర్క్‌ చేయడానికి విజయ్‌ ఓకే చెప్పినట్లు అతడి సన్నిహితులు వెల్లడించారు. కాగా ఈ సినిమా తొలి షూటింగ్‌ నల్లమల అడవుల్లో జరగనుంది. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో సాగే ఇసుక స్మగ్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తు‍న్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement