Allu Arjun, Sukumar Telugu Movie Latest Update | అల్లు అర్జున్‌ కోసం భారీ ప్లాన్‌.. - Sakshi
Sakshi News home page

బన్ని కోసం భారీ ప్లాన్‌..

Published Fri, Dec 27 2019 12:23 PM | Last Updated on Fri, Dec 27 2019 5:17 PM

Allu Arjun Sukumar Telugu Movie Latest Update - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టాప్‌ గేర్‌ వేశాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనంతరం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన బన్ని, ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, టీజర్‌తో బన్ని, త్రివిక్రమ్‌లు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఇక ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ మెగా హీరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో బన్ని హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే బన్నికి అర్య, ఆర్య2తో రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్లు అందించిన సుకుమార్‌ తాజాగా ఈ స్టైలీష్‌ స్టార్‌తో హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వచ్చిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ బన్ని అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకున్న సుకుమార్‌ చిత్రం.. రెగ్యులర్‌ షూటింగ్‌ తాజాగా ప్రారంభమైనట్లు సమాచారం. కేరళలోని దట్టమైన అడవుల్లో ఉన్న జలపాతం దగ్గర బన్ని ఇంట్రడక్షన్‌ సీన్స్‌ను రూపొందించాలని దర్శకుడు భావిస్తున్నాడట. బాహుబలిలో ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్‌ ఇక్కడే షూట్‌ చేశారు. ఈ సీన్స్‌కు విపరీతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలిలో ప్రభాస్‌ను మించిన పరిచయ సన్నివేశాన్ని అల్లు అర్జున్‌తో భారీగా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌.

ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణ కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే అందులో బన్ని పాల్గొనలేదని సమాచారం. హీరో అవసరం లేని కొన్ని సన్నివేశాలను ఆ జలపాతం దగ్గర చిత్రీకరించారంట. ఇక ‘అల వైకుంటపురములో’ విడుదల తర్వాత బన్ని రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటాడని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. గీతాఆర్ట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కనుంది. లీకు వీరుల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్ని లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడని, సుకుమార్‌ ‘నాన్నకు ప్రేమతో’, ‘వన్’సినిమాల మాదిరిగానే రివేంజ్‌ ఫార్ములాతోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. 

చదవండి:
‘బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement