స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విజయంలో తమన్ అందించిన సంగీతం కీలకమైన పాత్రను పోషించింది. తమన్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతమే. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వ్యూస్ పరంగా యూ ట్యూబ్ లో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ఆల్బమ్ వంద కోట్ల పైచిలుకు వ్యూస్‌ను సాధించింది. అయితే, తన సినిమాకు ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్‌ను బన్నీ తాజాగా ప్రశంసించారు.
ఈ నేపథ్యంలో బన్నీ ట్వీటర్ ద్వారా తమన్‌ను అభినందించాడు. ‘తమన్ నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఈ సినిమా ప్రారంభానికి ముందే, నాకు బిలియన్ ప్లే అవుట్స్ ఆల్బమ్ కావాలని నేను అడిగాను. వెంటనే నువ్వు ఓకే అనేశావ్. ఇప్పటికి 1.13 బిలియన్ మంది ఈ పాటలు విన్నారు. నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావ్. థ్యాంక్యూ తమన్’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. బన్నీ ట్వీట్‌పై స్పందించిన తమన్.. `ఈ ట్వీట్‌ను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్` అని రిప్లై ఇచ్చాడు.
My dear @MusicThaman . I am soo proud & contented you have lived upto ur words . I said “ I want an Album which has more than a BILLION play outs “ before #avpl starting . You said “ Done brother I Promise “ . Today it has 1.13 Billion n more . Thank you ! #manofwords
— Allu Arjun (@alluarjun) April 11, 2020
Comments
Please login to add a commentAdd a comment