
తిరుమల: అల.. వైంకుఠపురం చిత్ర బృందం శుక్రవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకోనుంది. హీరో అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథిగృహంలో బసచేశారు. శుక్రవారం ఉదయం తిరుమలేశుని దర్శనం చేసుకునేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లుచేశారు.