
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ ‘అల వైకుంఠపురంలో’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వసూళ్లు మొదటి రోజు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ రోజురోజుకీ మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యట్రిక్ మూవీ.. డుదలైన నాలుగు రోజుల్లో వంద కోట్లు రాబట్టి సంక్రాంతి పోరులో దూసుకుపోతుంది. అటు మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ధీటుగా కలెక్షన్లు సాదిస్తుంది. ఇక ఈ సినిమాతో బన్నీ అభిమానులకు తన యాక్టింగ్ పవర్ చూపించారు. ఇక సినిమాకు తమన్ సంగీతం అందించడం ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు.(అల వసూళ్లు ఇలా..)
తాజాగా ఈ సినిమా చూసిన యంగ్ స్టార్ శర్వానంద్ మూవీపై స్పందించారు. ‘ఇప్పుడే అల వైకుంఠపురంలో సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లో బన్నీ తన నటనతో కుమ్మేశాడు. ఒక నటుడిగా ఈ సినిమా చూసి చాలా నేర్చుకున్నాను. కంగ్రాట్యూలేషన్స్ త్రివిక్రమ్ గారు, తమన్, చిన్నబాబు అలాగే చిత్ర యూనిట్’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇది చూసిన అల్లు అర్జున్ వెంటనే శర్వానాంద్ ట్వీట్‌కు బదులిచ్చారు. ‘‘మైడియర్ శర్వా... సినిమాను అభినందించినందుకు కృతజ్ఞతలు. సినిమాను, నా వర్క్స్‌ను ఇష్టపడ్డందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ రీట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే సినిమా బాగుందంటూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ శ్రీనువైట్ల, అడవిశేషు, నిహారిక, సుశాంత్ ప్రశంసలు కురింపించిన విషయం తెలిసిందే.
My dear Sharwa... thank you sooo much for the generous compliments . Soo glad you liked our movie and my work . Humbled . #Sharwanand #AlaVaikuntapurramuloo pic.twitter.com/OW4X56jqo3
— Allu Arjun (@alluarjun) January 16, 2020