6న బన్నీ ఫ్యాన్స్‌కు పండగే పండగ | Ala Vaikunthapurramloo Musical Concert Will Be Held On This Date | Sakshi
Sakshi News home page

బన్నీ ఫ్యాన్స్‌కు ముందే వస్తున్న పండగ

Published Sun, Dec 29 2019 1:41 PM | Last Updated on Sun, Dec 29 2019 5:21 PM

Ala Vaikunthapurramloo Musical Concert Will Be Held On This Date - Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచానాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు మంచి సక్సెస్‌ సాధించడంతో ఈ సినిమాపై కుడా సాధారణంగానే హైప్‌ క్రియేట్‌ అయింది. ఇక ‘సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మా’పాటలతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ మాదిరి ఓ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోంది. 

దీనిలో భాగంగా హైదరాబాద్‌లో భారీగా ‘మ్యూజికల్‌ కాన్సెర్ట్‌’ ఏర్పాటు చేయనున్నారు. జనవరి 6న యుసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడకను అట్టహాసంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్‌ చరిత్రలోనే అల.. వైకుంఠపురములో మ్యూజికల్‌ కాన్సెర్ట్ నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేయనున్నారని టాక్‌. ఈ వేడకకు చిత్రపరిశ్రమకు చెందిన అతిరథమహారథులను ఆహ్వానించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బన్ని అభిమానులకు సంక్రాంతి ఫెస్టివల్‌కు ముందే మ్యూజికల్‌ ఫెస్ట్‌తో మైమరిచిపోనున్నారు. టబు, సుశాంత్‌, నవదీప్‌, జయరామ్‌, సముద్రఖని, మురళీ శర్మ, నివేతా పేతురాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

చదవండి: 
అల్లు అర్జున్‌ కోసం భారీ ప్లాన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement