
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బన్నీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ చిత్రంలోని పాటలన్ని సంచలనం సృష్టించాయి. యూట్యూబ్‌లో అనేక రికార్డులను సొంతం చేసుకున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో సినిమా మరో ఘనత సాధించింది. చదవండి: అల్లు అర్జున్‌కు నో చెప్పిన అనసూయ
ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన టాప్-20 ట్రైలర్ల జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. అయితే దక్షిణాది నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే నిలవడం విశేషం. కాగా అల్లు అర్జున్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గానే ఉంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సౌత్ హీరోగా ఇటీవలే బన్నీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చదవండి: నలభైఐదు కోట్ల వ్యూస్ సాధించిన ‘బుట్టబొమ్మ’
#AlaVaikunthapurramuloo is the only Telugu film among the TOP 20 Most Viewed Trailers 2020 on @IMDb 🕺🧡https://t.co/fCYtJs6QEt@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine @adityamusic pic.twitter.com/eQimwbtVaT
— Geetha Arts (@GeethaArts) December 5, 2020
Comments
Please login to add a commentAdd a comment