
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. కేవలం వినిపించడమే కాదు..డైలాగ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆదివారం పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ సందడి అయితే అంతా ఇంతా కాదు. ఏ నగరంలో చూసిన టపాసులు పేలుస్తూ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.
అయితే ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప రాజ్.. మరో క్రేజీ రికార్డ్ నమోదు చేశాడు. బిహార్‌లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా 2.6 లక్షల మంది లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్‌ను సాధించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పుష్ప టీమ్ ట్విటర్‌లో పంచుకుంది. దీంతో పుష్ప-2 రికార్డులు చూస్తుంటే ఏ ఇండియన్ సినిమాకు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు.
కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2021 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే.
His arrival means one thing - the existing records tumble 💥💥#Pushpa2TheRuleTrailer launch event registers the highest number of live viewers for an event with 2.6 LAKH concurrent viewers❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋
▶️ https://t.co/FKXAngle5q… pic.twitter.com/vuCpMypShD— Pushpa (@PushpaMovie) November 18, 2024