పుష్ప 2 ఫేమస్ డైలాగ్‌.. ప్రొ కబడ్డీలోనూ వాడేశారు! | Allu Arjun Pushpa 2 The Rule Dialogue Poster Shared By Pro kabaddi Team | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: పుష్ప 2 ఫేమస్ డైలాగ్‌.. ప్రొ కబడ్డీలోనూ వాడేశారు!

Published Tue, Nov 19 2024 6:10 PM | Last Updated on Tue, Nov 19 2024 7:20 PM

Allu Arjun Pushpa 2  The Rule Dialogue Poster Shared By Pro kabaddi Team

పుష్ప-2 ఆ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం రావాల్సిందే. అంతలా సినీప్రియులను ఊపేస్తోంది తాజాగా రిలీజైన ట్రైలర్. ఆ డైలాగ్స్, ఆ మేనరిజం బన్నీ ఫ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఊపేస్తున్నాయి. నవంబర్ 17న పాట్నా వేదికగా భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. దేశంలో ఇంతవరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డులను పుష్ప-2 సాధించింది.

అయితే పుష్పలోని ఆ డైలాగ్‌ చెబితే ఫ్యాన్స్‌కే కాదు.. ఎవరికైనా పూనకాలే. అంతలా ఫేమస్ అయింది. పుష్ప-2 ట్రైలర్‌లో 'పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్‌ ఫైర్‌' అనే బన్నీ డైలాగ్‌ ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఇలాంటి ఫేమస్ డైలాగ్‌ను ప్రొ కబడ్డీ లీగ్‌లోనూ వాడేశారు.

ఈ సీజన్‌లో విజయాలతో జోరుమీదున్న తెలుగు టైటాన్‌ టీమ్‌ ప్రత్యేకంగా పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ డైలాగ్‌తో ఉన్న టీమ్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. 'టైటాన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్‌' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను పుష్ప టీమ్‌ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement