
టీజర్ రెడీ అయింది. టీజర్‌లో ఏముందో చిన్న శాంపిల్ కూడా చూపించేశారు. ఫుల్ టీజర్‌ను డిసెంబర్ 11న చూపిస్తాం అంటోంది ‘అల వైకుంఠపురములో..’ చిత్రబృందం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురములో’. గతంలో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సినిమాలు ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. టబు, రాజేంద్రప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఈ నెల 11న రిలీజ్ కానుంది. టీజర్‌లో కార్పొరేట్ ఆఫీస్ బోర్డ్ మీటింగ్ జరుగుతున్న సమయంలో బల్ల ఎక్కి వాక్ చేస్తూ అల్లు అర్జున్ కనిపించే చిన్న బిట్‌ను రిలీజ్ చేసింది టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది.