అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి వీడియోలో అర్హ తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బన్నీ అల.. వైకుంఠపురములో.. చిత్రంపై అర్హ చాలానే అల్లరి చేసింది. ఓ మై గాడ్ డాడీ లిరికల్ సాంగ్ వీడియోలో తన అన్న అయాన్‌తో కలిసి సందండి చేసింది. అలాగే రాములో రాములా సాంగ్‌లో బన్నీ దోశ స్టెప్పు వేశాడని ఫన్నీ కామెంట్ చేసింది. (చదవండి : బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య)
తాజాగా ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ బుట్టబొమ్మకు అర్హ.. లిప్ సింక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్‌లో వేరే వాయిస్‌తో సాంగ్ ప్లే అవుతున్న సమయంలో లిరిక్స్‌కు అనుకూలంగా అర్హ పెదవి కలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను బన్నీ భార్య స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మా చిన్ని బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ సాంగ్ పాడుతోంది.. క్వారంటైన్ ఫన్’ అని పేర్కొన్నారు. స్నేహరెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ మారింది. ఈ వీడియో చూసిన మెగా డాటర్ నిహారిక.. ‘హ..హ.. చిలక’ అని కామెంట్ కూడా చేశారు. మరోవైపు బుట్టబొమ్మ సాంగ్ క్రేజ్ ఖండాంతరాలు కూడా దాటేసింది. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ సాంగ్‌కు టిక్‌టాక్‌లో చిందేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.(చదవండి : బన్ని భారీ ఫైట్.. ఖర్చెంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment