
సాక్షి, హైదరాబాద్ : మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో.. రికార్డులు కొనసాగుతున్నాయి. యూఎస్ మార్కెట్‌లో అల మూవీ ఏకంగా మూడు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. త్వరలోనే బన్నీ మూవీ నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకోనుంది. అమెరికాలో ఆల్‌టైమ్ టాప్ గ్రాసర్స్‌లో ప్రస్తుతం ఐదో స్ధానంలో నిలిచిన అల బాహుబలి 2, బాహుబలి తర్వాత మూడవ స్ధానాన్ని దక్కించుకునే దిశగా వసూళ్లు సాధిస్తోంది. 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లతో రంగస్ధలం మూవీ పేరిట అమెరికాలో నాన్ బాహుబలి రికార్డు నమోదు కాగా, అల వైకుంఠపురంలో ఈ రికార్డును క్రాస్ చేసి టాప్ 3 స్ధానం దక్కించుకోనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్రివిక్రం టేకింగ్, అల్లు అర్జున్ నృత్యాలు, థమన్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవడంతో సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తూ అత్యధిక వసూళ్లను కొల్లగొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment