
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో’. తమన్ అందించిన స్వరాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతీ పాట సోషల్ మీడియాలో ఓ సెన్సేషన క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలోని పాటల క్రేజ్ ఖండాతరాలు దాటింది. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ దంపతులు డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి డ్యాన్స్ టిక్‌టాక్‌లో తెగ హల్‌చల్ సృష్టించింది.
తాజాగా ఇంగ్లండ్ మాజీ సారథి, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్‌కు కూడా ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కు మంత్ర ముగ్దుడైనట్లు అనిపిస్తోంది. తాజాగా ఈ పాటకు పీటర్సన్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఈ పాటకు హుక్ స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం బుట్టబొమ్మ సాంగ్‌కు పీటర్సన్ చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక పీటర్సన్‌కు టిక్‌టాక్ వీడియోలు చేయడం కొత్తేం కాదు. ఇప్పటికే ఆయన చేసిన టిక్‌టాక్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
చదవండి:
'నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు'
వార్నర్ నోట మహేశ్ పవర్‌ఫుల్ డైలాగ్
#ButtaBomma craze Crossed Continents
— Vamsidhar 🇮🇳 (@Vamsidhar467) May 11, 2020
This time famous X England cricketor #ButtaBomma FT.@KP24
😂😂@ArmaanMalik22 @MusicThaman @alluarjun @hegdepooja @AlwaysJani pic.twitter.com/Q2KAi7uxFI