Photo Courtesy: IPL
Kevin Pietersen Comments On David Warner: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి మూట కట్టుకుంది. అయితే ముఖ్యంగా గంపెడు ఆశలు పెట్టెకున్న డేవిడ్ వార్నర్ ఆభిమానులను నిరాశపరిచాడు. నోర్జే వేసిన తొలి ఓవర్ మూడో బంతిని అంచనా వేయలేకపోయిన వార్నర్... అక్షర్ పటేల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో డెవిడ్ వార్నర్ ఔటైన తీరుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పందించాడు. వార్నర్ ఔటైన తీరు తనను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదని అతడు తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలింగ్ ద్వయం అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడాకు డేవిడ్ వార్నర్‌కు ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు అని పీటర్సన్ పేర్కొన్నాడు. రబాడా ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో వార్నర్ వికెట్‌ని పడగొట్టాడని, వార్నర్‌కు ఢిల్లీ జట్టుతో మ్యాచ్ చాలా కష్టమైనదని కెవిన్ పీటర్సన్ చెప్పాడు.
"డేవిడ్ వార్నర్‌కు బౌలింగ్ ఎలా చేయాలో నార్ట్‌జే , రబాడాలకు తెలుసు. రబాడా అతన్ని ఇప్పటికే 4-5 సార్లు ఔట్ చేశాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి వార్నర్‌కు ఎలా బౌలింగ్ చేయాలో వారికి తెలుసు . నిజానికి నాకు వార్నర్ ఔటైన తీరు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వార్నర్‌కు ఇది నిజంగా కఠినమైన సవాల్ అని నేను భావించాను”అని పీటర్సన్ స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యలో భాగంగా వెల్లడించాడు.
డేవిడ్ వార్నర్ కూడా అన్రిచ్ నార్ట్జే , కగిసో రబాడా వంటి బౌలర్లను ఎలా ఎదర్కొవాలని మ్యాచ్ ముందు రోజు ఆలోచించి ఉంటాడని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌ని పెవిలియన్‌కు పంపడంలో నార్ట్జే విజయవంతం అయ్యాడని అతడు పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
చదవండి: IPL 2021 2nd Phase SRH Vs DC: ఎస్‌ఆర్‌హెచ్‌పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘనవిజయం
Comments
Please login to add a commentAdd a comment