
హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు సామజవరగమన, రాములో రాములా సాంగ్ సన్సేషన్ క్రియేట్ చేయగా.. సినిమా విడుదలయ్యాక బుట్టబొమ్మ వీడియో సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇటీవల ఈ సాంగ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చిందులేశాడంటే ఈ సాంగ్‌కు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ట్విటర్‌లో వెల్లడించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను.. అర్మాన్ మాలిక్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాగా, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంలో అందులోని పాటలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే.
#200millionforbuttabomma #ButtaBomma #Unstoppableavpl #AlaVaikunthapurramuloo album ♥️🎬🎛
— thaman S (@MusicThaman) May 31, 2020
My love @alluarjun gaaru my respect to #trivikram gaaru ♥️
It’s the love & trust of them @ramjowrites @haarikahassine @vamsi84 @GeethaArts 🎧✊⭐️⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/kAPxY6SgOc