
హైదరాబాద్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ధేశకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురంలో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. అలవోకగా అల రికార్డులు నమోదువుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దర్బార్, సరిలేరు, తానాజీ, చపాక్ వంటి మూవీలతో పోటీ ఎదురైనా అమెరికాలో తొలివారంలోనే రెండు మిలియన్ డాలర్లుపైగా రాబట్టింది. అమెరికాలో ఎనిమిది రోజుల్లోనే 2.83 మిలియన్ డాలర్ల వసూళ్లతో సైరా లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించి అత్యధిక గ్రాస్ రాబట్టిన ఏడో తెలుగు సినిమాగా అల వైకుంఠపురం నిలిచింది. మూడు మిలియన్ డాలర్ల వసూళ్లకు అత్యంత చేరువైన అల మూవీ ఓవర్సీస్ వసూళ్లలో తిరుగులేని రికార్డును సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment