బుట్టబొమ్మ మరో సెన్సేషన్‌ | Allu Arjun Butta Bomma Song Hits Four Million Likes | Sakshi
Sakshi News home page

బుట్టబొమ్మ మరో సెన్సేషన్‌

Published Sun, May 23 2021 8:06 AM | Last Updated on Sun, May 23 2021 8:43 AM

Allu Arjun Butta Bomma Song Hits Four Million Likes - Sakshi

టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలియంది కాదు. షార్ట్‌ వీడియో యాప్‌ల ద్వారా దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్‌ అయిన ఈ పాట.. క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్టెప్పులతో మరింత వైరల్‌ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో మరో రికార్డు క్రియేట్‌ చేసింది. 

యూట్యూబ్‌లో నాలుగు మిలియన్ల లైకులతో.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సాంగ్‌గా నిలిచింది. అల వైకుంఠపురములో.. మూవీ లోని బుట్టబొమ్మ సాంగ్‌ యూట్యూబ్‌లో అరవై కోట్లకు పైగా వ్యూస్‌ సాధించి దూసుకుపోతోంది. థమన్‌ సంగీతం అందించిన ఈ సాంగ్‌ను అర్మాన్‌ మాలిక్‌ పాడాడు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పులు, అల్లు అర్జున్‌ గ్రేస్‌.. బుట్టబొమ్మకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.
చదవండి: బుట్టబొమ్మగా మారిన వార్నర్‌ భార్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement