YouTube Record
-
చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్
Chandrayaan-3 Youtube most viewed Record చంద్రయాన్ -3కి చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన కోట్లాదిమంది భారతీయుల కలల్ని సాకారం చేసింది. ఇస్రో. దీంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లపై అభినందనల వెల్లువ కురిసింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ ఖ్యాతిని దక్కించుకుంది. జాబిల్లిపై భారతీయజెండాను రెపరెపలాడించేందుకు ఉద్దేశించిన ఈ చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్‌తో రూ. 615 కోట్లు. అతితక్కువ బడ్జెట్‌తో అంతరిక్ష యాత్రల జాబితాలో ప్రత్యేకంగా నిలిచింది. ప్రత్యేకించి 96.5 మిలియన్ల డాలర్ల బ చంద్రయాన్-2తో బడ్జెట్‌తో పోల్చినా ఇది తక్కువే కావడం విశేషం. మరో విశేషాన్ని కూడా చంద్రయాన్-3 మిషన్ సాధించింది. యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాంగా ఘనతను దక్కించుకుంది. భారత ఇస్రో చంద్రయాన్ -3 లైవ్‌ను ఏకంగా 8.06 మిలియన్లు మంది వీక్షించారని తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రత్యక్ష ప్రసారాన్ని అత్యధికంగా చూసిన ఇతర కార్యక్రమాలు బ్రెజిల్ vs దక్షిణ కొరియా ఫుట్‌బాల్ మ్యాచ్: 6.15 మిలియన్లు బ్రెజిల్ vs క్రొయేషియా ఫుట్‌బాల్ మ్యాచ్: : 5.2 మిలియన్లు వాస్కో vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 4.8 మిలియన్లు అమెరికా స్పేస్ఎక్స్ క్రూ డెమో: 4.08 మిలియన్లు బీటీఎస్ బటర్ వెన్న: 3.75 M యాపిల్ లైవ్ ఈవెంట్ 3.69 M జానీ డెప్ v అంబర్ ట్రయిల్ : 3.55 మిలియన్లు ఫ్లుమినెన్స్ vs ఫ్లెమెంగో ఫుట్‌బాల్ మ్యాచ్ : 3.53 మిలియన్లు కారియోకో చాంపియషన్ షిప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్: 3.25మిలియన్లు Most Viewed Live Streams on YouTube ▶️ 1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥 2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M 3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M 4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M 5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M 6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M 7. 🇺🇸 Apple: 3.69 M 8. 🧑⚖️🇺🇸… — The World Ranking (@worldranking_) August 23, 2023 -
ప్రపంచాన్ని ఊపేసిన ఈ పాట గుర్తుందా?
ఎంటర్టైన్మెంట్ ఎల్లలు లేనిది. భాష తెలియకపోయినా.. కంటెంట్‌ను ఆస్వాదించడమే అందరికీ తెలిసింది. కానీ, ఒక పాటను అంతలా ఆదరించడం.. ఆస్వాదించడం కనిపించింది అప్పుడే. ఆ పాట అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కే-పాప్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. హుషారెత్తించే మ్యూజిక్‌తో గ్లోబ్ మొత్తాన్ని చిందులేయించింది. యూట్యూబ్‌లో తొలిసారి మిలియన్లైకులతో గిన్నిస్ బుక్ రికార్డు.. అంతకు మించి ఫస్ట్ బిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న తొలి ఘనతకు దక్కించుకుంది గంగ్నమ్ స్టైల్. ఇవాళ్టికి ఈ సెన్సేషన్ సాంగ్ రిలీజ్ అయ్యి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. సాక్షి, వెబ్‌డెస్క్: కొరియా పాప్సాంగ్ గంగ్నమ్ స్టైల్.. జులై 12న టీజర్ రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 15న ఆడియోతో పాటు ఒకేసారి యూట్యూబ్‌లో అప్లోడ్ అయ్యింది. అప్పటికే సౌత్ కొరియాలో సింగర్ సై(పార్క్ జెయ్ సాంగ్)కు కొద్దిపాటి ఫేమ్ ఉంది. అయితే రిలీజ్ తర్వాత పాటకు మిక్స్డ్ రివ్యూస్ దక్కాయి. కానీ, నెమ్మదిగా గంగ్నమ్ స్టైల్ మత్తు గ్లోబ్ మొత్తానికి ఎక్కేసింది. సిగ్గుపడే మగవాళ్ల నోట సైతం ‘సెక్సీ లేడీ’ అనే పదం వచ్చేలా చేసి.. హుషారెత్తించింది ఈ పాట. 9 years ago today, Psy's first teaser for 'Gangnam Style' was released. pic.twitter.com/dMWShXGGpW — On This Day in K-Pop (@thisdayinkpop) July 12, 2021 డబుల్ మీనింగ్, కానీ.. ‘ఒప్ప గంగ్నమ్ స్టైల్..’ గగ్నమ్ అనేది సౌత్ కొరియాలో ఒక జిల్లా. కొరియన్ పాప్ సింగర్ సై పుట్టి, పెరిగింది అక్కడే. అందుకే అక్కడి ఆడవాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికే ఆ ఆల్బమ్‌ను కంపోజ్ చేశాడు. ఒప్ప అంటే.. పెద్దన్న, తోపు అనే అర్థాలు వస్తాయి. అక్కడి ఆడవాళ్లను, ముఖ్యంగా తన కంటికి నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్చేసేందుకు చేసే ప్రయత్నాల్ని.. తన విరహా వేదనను వివరిస్తూ సాగే పాట అది. అందుకే అక్కడి ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్లకు ఆ పాటను అంకితం చేశాడు. అయితే ఆ పాట లిరిక్స్ పక్కా డబుల్ మీనింగ్. విజువల్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ, అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే.. దానిని సూపర్ హిట్ చేసేశారు జనాలు. అప్పటిదాకా హిందీ, ఇంగ్లీష్, డీజే రీమిక్స్ సాంగ్స్‌తో హోరెత్తిన న్యూఇయర్ వేడుకల్లో కొత్త జోష్ నింపింది గగ్నమ్ స్టైల్. ముఖ్యంగా గుర్రపు స్వారీ స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. 30 దేశాల్లో ఛార్ట్‌బస్టర్ దక్షిణ కొరియా వయా అమెరికా నుంచి ప్రపంచం మొత్తం గంగ్నమ్ స్టైల్ పాకింది. రిలీజ్ అయిన అన్ని దేశాల్లోనూ ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. గుర్రపుస్వారీ డ్యాన్స్‌ను ప్రపంచం మొత్తం ఆస్వాదించింది. కొరియా పాప్ మ్యూజిక్ సత్తా ఏంటో ఆ టైంలోనే చాటిన ఈ సాంగ్.. చాలామందికి ఇది కొరియన్ ఆల్బమ్ అని తెలియకుండానే ఎక్కేసింది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ ఊపేసింది. అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సైతం స్టెప్పులేయగా, అప్పటి యూఎన్ఏ సెక్రటరీ బాన్ కీ మూన్ ఐక్యత కోసం ఈ పాటను ప్రచార గీతంగా ఉపయోగించాలని పిలుపు ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆ టైంలో.. ‘‘కొరియన్ వేవ్‌లో ప్రపంచమంతా కొట్టుకుపోతోంద’ని సరదాగా వ్యాఖ్యానించాడు. జకోవిచ్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఇలా.. ఇలా ఆటగాళ్లు, మరెందరో స్టార్లు సైతం చిందులేశారు. సాంగ్ ఆఫ్ యూట్యూబ్ కొరియా పాప్ సింగర్ పార్క్ జెయ్ సాంగ్(సై)(43), యూ జంగ్ హ్యుంగ్ రాసిన సాంగ్. మ్యూజిక్ కూడా వాళ్లదే. చో సూ హ్యున్ డైరెక్షన్. గుర్రపు స్వారీ, కంగారు, పాండా స్టెప్పులను కలగలిపి లీ జు సన్స్టెప్పులు కంపోజ్ చేశాడు. కొరియన్ చెస్ గేమ్ జంగ్గీ తరహాలో మూమెంట్స్.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక ఈ పాటలో బుడ్డోడు వాంగ్ మిన్వూ, నటుడు యూ జయ్ సుక్, నోహ్ హోంగ్ హుల్, ట్రైన్లో కనిపించే నటి హ్యునా.. ఇలా అందరూ కలిసి పాటను రిచ్‌గా మార్చేశారు. మొదటిరోజు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. #GangnamStyle #PSY #9YearsofGangnamStyle pic.twitter.com/vLuSxgOwID — ashwik (@ursashwik) July 14, 2021 సౌత్ కొరియా గావోన్ ఛార్ట్ నుంచి ఆగష్టు నాటికి యూట్యూబ్ టాప్ 100 లిస్ట్‌కి అటుపై బిల్బోర్డ్ హాట్ 100 కి చేరింది. సెప్టెంబర్ నాటికి కేవలం ఐదు మిలియన్ల మార్క్‌కు చేరింది. కానీ, ఆ తర్వాత విధ్వంసం మొదలైంది. డిసెంబర్ 21 నాటికి గంగ్నమ్ స్టైల్ బిలియన్ మార్క్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 4 బిలియన్ల వ్యూస్‌కి పైగా.. ఓవరాల్ టాప్ పొజిషన్ సాంగ్ లిస్ట్‌లో ఎనిమిదో పొజిషన్లో కొనసాగుతోంది గంగ్నమ్స్టైల్. పేరడీలు, మిగతా వెర్షన్లు ఇవన్నీ లెక్కేస్తే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న డెస్పాసిటోను ఎనిమిదేళ్ల క్రితమే గంగ్నమ్ స్టైల్ దాటేసినట్లే లెక్క. సై ఏం చేస్తున్నాడు ‘సై సిక్స్రూల్స్’ పేరుతో రిలీజ్ చేసిన ఆల్బమ్‌లో మొదటి పాటే గంగ్నమ్ స్టైల్. 2012లో సై ఒక వైరల్ స్టార్. కానీ, ఆ ఫేమ్‌ను సై కొనసాగించలేకపోయాడు. కారణం.. సై మిగతా పాప్ సింగర్స్లాగా కాదు. అభిమానం ఎక్కడుంటే.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఉచితంగా ప్రదర్శనలిచ్చేవాడు. బ్రాండ్లు, ప్రమోషన్, సంపాదన కోసం ఏనాడూ పెద్దగా ఆలోచించేవాడు కాదు. గంగ్నమ్స్టైల్ తర్వాత సైకి దక్కిన పాపులారిటీతో ఒక గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయే అవకాశం దక్కినా.. దానికి ఆయన మొగ్గు చూపించలేదు. ఆ తర్వాత నాలుగైదు పాప్ సాంగ్స్ కంపోజ్ చేసినప్పటికీ.. తర్వాత కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రియాలిటీ షోలను నిర్వహిస్తున్నాడు. పీ నేషన్ పేరుతో కంపెనీ స్థాపించి..కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. మామూలుగా సై(43) ప్లేస్‌లో వేరే ఎవరు ఉన్నా.. ప్రదర్శనల కోసం, యూట్యూబ్ రికార్డుల కోసం, డబ్బు కోసం పాకులాడేవాళ్లేమో!. -
బుట్టబొమ్మ మరో సెన్సేషన్
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘బుట్టబొమ్మ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. షార్ట్ వీడియో యాప్‌ల ద్వారా దేశంలోని మిగతా భాషల్లోనూ పాపులర్ అయిన ఈ పాట.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్పులతో మరింత వైరల్ అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‌లో మరో రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో నాలుగు మిలియన్ల లైకులతో.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సాంగ్‌గా నిలిచింది. అల వైకుంఠపురములో.. మూవీ లోని బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో అరవై కోట్లకు పైగా వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌ను అర్మాన్ మాలిక్ పాడాడు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, అల్లు అర్జున్ గ్రేస్.. బుట్టబొమ్మకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. చదవండి: బుట్టబొమ్మగా మారిన వార్నర్ భార్య -
చరిత్ర సృష్టించిన ‘టీ సిరీస్’
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ టీ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. సంగీత రంగంతో పాటు సినీ నిర్మాణ రంగంలోనూ ఉన్న ఈ సంస్థ యూట్యూబ్‌లో ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన చానల్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల(పది కోట్ల)కు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన ఏకైక సంస్థ టీ సిరీస్ రికార్డ్ సృష్టించింది. సందర్భంగా యూట్యూబ్ నిర్వాహకులు టీ సిరీస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోనే రిలీజ్ చేశారు. టీ సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ కూడా ఈ రికార్డ్ నెలకొల్పటంలో భాగస్వాములైన ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఇండియా శక్తి. భారతీయత కలిగి కంటెంట్, వీక్షకుల ఆదరణ, మా డిజిటల్ టీం కృషి మూలంగానే యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ గెలుచుకోగలిగాం అంటూ ట్వీట్ చేశారు. Congratulations to @TSeries for reaching 100M subscribers! 🎉 pic.twitter.com/6kHopm2GAZ — YouTube (@YouTube) 30 May 2019 Salute to India's power! It is the power of Indian content, consumers and our digital strength that has lead us to a milestone of 100 million subscribers on YouTube. Thank you. pic.twitter.com/XSGJP83pE3 — Bhushan Kumar (@itsBhushanKumar) 29 May 2019 -
దుమ్ములేపుతున్న ‘రావాలి జగన్.. కావాలి జగన్’
సాక్షి, హైదరాబాద్: స్టార్ హీరోల టీజర్స్, సినిమా ట్రైలర్స్ యూట్యూబ్‌ను షేక్ చేయడం ఈరోజుల్లో కామన్. కానీ వాటికి అతీతంగా ఓ రాజకీయ నాయకుడికి సంబంధించిన పొలిటికల్ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం రేపడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి రేర్ రికార్డ్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. వైఎస్ జగన్ అభిమానులకు ఈ పాట తారకమంత్రంగా మారింది. అందుకే ఆ జోష్ యూట్యూబ్ వ్యూస్‌లో స్పష్టంగా కనిపిస్తోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. ఆదివారం నాటికి యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షించిన వారి సంఖ్య కోటిన్నరకు దాటి సరికొత్త చరిత్రను లిఖించింది. మార్చి 8న విడుదలైన ఈ పాట దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం ఆల్‌టైం రికార్డుగా చర్రిలొకెక్కింది. ప్రఖ్యాత సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. గతంలో నిన్ను నమ్మం బాబు అని చంద్రబాబు మోసపూరిత పాలన గురించి పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వైఎస్ జగన్ ఎందుకు రావాలో ఈ పాటలో వివరించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ వీడియోకు వస్తున్న అశేష స్పందన.. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ఘన విజయానికి సంకేతమని పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ జగన్‌కు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందన్నది ఈ వీడియో సృష్టించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా యువత ఎక్కువగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. -
సాహోరే.. హైబ్రిడ్ పిల్లా
సాక్షి, హైదరాబాద్: బాహుబలి సిరీస్ సృష్టించిన ప్రభంజనం తెలియంది కాదు. మరోవైపు ఫిదా చిత్రం టాలీవుడ్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రెండూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినవే. కలెక్షన్లపరంగా సంగతి పక్కనపెడితే మ్యూజిక్ పరంగా మాత్రం ఫిదానే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇందుకు నిదర్శనంగా యూట్యూబ్‌లో ఓ రికార్డును ప్రస్తావిస్తున్నారు. బాహుబలి-2లోని టైటిల్ సాంగ్ సాహోరో బాహుబలి పాట కన్నా ఫిదాలోని వచ్చించే సాంగ్ ఎక్కువగా వ్యూవ్స్ రావటం విశేషం. సాహోరే సాంగ్ 11 నెలల్లో సాధించిన వ్యూవ్స్‌ను వచ్చిండే సాంగ్ 7 నెలల్లోనే దాటేసింది. బాహుబలి ది కంక్లూజన్‌కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా.. ఫిదాకు శక్తికాంత్ సంగీతం అందించారు. హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి చేసిన మ్యాజిక్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో హల్ చల్ చేస్తున్నారు. -
సాహోరే సాంగ్ కన్న వచ్చించే సాంగ్ ఎక్కువ వ్యూవ్స్
-
అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ
-
అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేసిన రష్మీ
స్టార్ హీరో అల్లు అర్జున్ సాధించిన ఓ రికార్డ్‌ను హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ బ్రేక్ చేసింది. ఇటీవల విడుదలైన గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ, ఈ ఫీట్ సాధించింది. ఈ సినిమాలో హాట్ హాట్ సీన్స్‌తో అలరించిన రష్మీ, అదే రేంజ్లో ఓ పాట కూడా చేసింది. సిద్ధూ అనే కొత్త కుర్రాడితో కలిసి రష్మీ చేసిన రొమాన్స్ సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. వెండితెర మీదే కాదు.. యూట్యూబ్‌లో కూడా ఈ పాట సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో పాటల విషయంలో యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన రికార్డ్ అల్లు అర్జున్ పేరిట ఉండేది. అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మామ పాటను ఇప్పటి వరకు కోటీ 90 లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. అయితే బన్నీ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ రష్మీ నటించిన హాట్కు రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం మూడు నెలల కాలంలోనే కావటం మరో విశేషం.