ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ టీ సిరీస్ అరుదైన ఘనత సాధించింది. సంగీత రంగంతో పాటు సినీ నిర్మాణ రంగంలోనూ ఉన్న ఈ సంస్థ యూట్యూబ్‌లో ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్స్ కలిగిన చానల్‌గా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల(పది కోట్ల)కు పైగా సబ్‌స్క్రైబర్స్ కలిగిన ఏకైక సంస్థ టీ సిరీస్ రికార్డ్ సృష్టించింది.
సందర్భంగా యూట్యూబ్ నిర్వాహకులు టీ సిరీస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోనే రిలీజ్ చేశారు. టీ సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ కూడా ఈ రికార్డ్ నెలకొల్పటంలో భాగస్వాములైన ప్రేక్షకులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఇండియా శక్తి. భారతీయత కలిగి కంటెంట్, వీక్షకుల ఆదరణ, మా డిజిటల్ టీం కృషి మూలంగానే యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ గెలుచుకోగలిగాం అంటూ ట్వీట్ చేశారు.
Congratulations to @TSeries for reaching 100M subscribers! 🎉 pic.twitter.com/6kHopm2GAZ
— YouTube (@YouTube) 30 May 2019
Salute to India's power! It is the power of Indian content, consumers and our digital strength that has lead us to a milestone of 100 million subscribers on YouTube. Thank you. pic.twitter.com/XSGJP83pE3
— Bhushan Kumar (@itsBhushanKumar) 29 May 2019
Comments
Please login to add a commentAdd a comment