
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కట్టేందుకు ‘సాక్షి’సిద్ధమైంది. రంగం ఏదైనా ప్రతిభే కొలమానంగా అవార్డులను అందించనుంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీస్తోంది. ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ పేరిట సత్కరిస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 6వ ఎడిషన్‌కు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపవచ్చు. ఈసారి ఎంట్రీలను ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు.
సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయిస్తుంది. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవలను కొనియాడడం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన కలిగిన వారంతా తమకు తెలిసిన ప్రతిభామూర్తుల్ని గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్‌ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫామ్‌లో ఇచ్చిన చిరునామాకు పంపవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు www. sakshiexcellenceawards.com వెబ్‌సైట్‌కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు (వర్కింగ్ డేస్‌లో) 040–23322330 నంబరు ద్వారా లేదా sakshiexcellenceawards2019 @sakshi.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment