
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ హాలులో సెప్టెంబర్ 17న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ ముఖ్య అతిథులుగా... ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా... ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’(స్పోర్ట్స్- ఫిమేల్) అవార్డును కోనేరు హంపి అందుకున్నారు.
‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కోనేరు హంపి(స్పోర్ట్స్- ఫిమేల్)
చదరంగానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. 15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించిన ఘనత కోనేరు హంపికి ఉంది! హంపీ అకౌంట్‌లో బంగారు పతకాలూ ఉన్నాయి. అండర్ 10, అండర్ 12, అండర్ 14 ఛాంపియన్‌షిప్ టైటిల్స్ ఉన్నాయి. అర్జున ఉంది. పద్మశ్రీ ఉంది. ఇప్పుడు సాక్షి ఎక్స్‌లెన్స్ ‘జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్’ అవార్డు కూడా హంపి విజయాలకు జత కలిసింది. హంపీ ఏపీ చెస్ క్రీడాకారిణి. మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్. ఆమె కనని కల ఒకటి సాకారం అయింది! అది.. అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకోవడం. హంపి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ.
మరిన్ని విజయాలకు స్ఫూర్తి...
క్రీడల్లో నాకు పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు విభిన్న కేటగిరీల్లో అవార్డులు తీసుకుంటున్న అందరికీ అభినందనలు. జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏది సాధించినా దానికి ప్రతిగా వచ్చే ఇటువంటి పురస్కారాలు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్యూ సాక్షి. ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు.
–కోనేరు హంపి, చదరంగం క్రీడాకారిణి
కోనేరు హంపి గురించి సంక్షిప్తంగా..
►కోనేరు హంపి 31 మార్చి 1987లో కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు.
►తండ్రి కోనేరు అశోక్ ఆమె మొదటి కోచ్
►15 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా కోనేరు హంపి చరిత్ర
సాధించిన విజయాలు- వరల్డ్ చాంపియన్‌షిప్స్
►అండర్-10 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1997, ఫ్రాన్స్- స్వర్ణ పతకం
►అండర్-12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1998, స్పెయిన్- స్వర్ణ పతకం
►అండర్- 12 గర్ల్స్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్స్ 1999, స్పెయిన్- రజత పతకం
►అండర్-14 వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2000, స్పెయిన్- స్వర్ణ పతకం
►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2001, ఏథెన్స్, గ్రీస్- స్వర్ణ పతకం
►వరల్డ్ జూనియర్ గర్ల్స్ చెస్ చాంపియన్‌షిప్ 2002, గోవా, ఇండియా- రజత పతకం
►వరల్డ్ కప్ 2002, హైదరాబాద్, ఇండియా- సెమీ ఫైనలిస్ట్
►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2004, ఎలిస్తా, రష్యా- కాంస్య పతకం
►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ 2008, నల్చిక్, రష్యా- కాంస్య పతకం
►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్, 2010 టర్కీ- కాంస్య పతకం
►వుమెన్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్- 2011- రజత పతకం
Comments
Please login to add a commentAdd a comment