మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నేషనల్ క్రష్... సోషల్ మీడియాలో వీడియో వైరల్ | Rashmika Mandanna Dance Pushpa Song Saami Saami with Krithi Shetty | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: పుష్ప సాంగ్‌కు ఇద్దరు భామల స్టెప్పులు.. వీడియో వైరల్

Published Sat, Oct 29 2022 3:52 PM | Last Updated on Sat, Oct 29 2022 3:54 PM

Rashmika Mandanna Dance Pushpa Song Saami Saami with Krithi Shetty - Sakshi

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఉన్న క్రేజే వేరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా నటిగా గుర్తింపు దక్కించుకున్న భామ టాలీవుడ్‌ సినిమాలో తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రంలో ఆమె 'రారా సామి.. బంగారు సామి' అంటూ సాగే పాటతో యూత్‌ను ఊర్రూతలుగించింది. తాజాగా రష్మిక మరోసారి శ్రీవల్లి అవతారమెత్తింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్‌లో మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టింది. మరో నటి కృతి శెట్టితో కలిసి వేదికపై రారా సామి అంటూ పుష్ప సినిమాను గుర్తుకు తెచ్చింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టిన్‌గా ఉండే ఈ భామ ఇటీవలే మాల్దీవుల్లో వ్యాకేషన్‌కు వెళ్లి వచ్చింది. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 34 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయింది. ఆమె ఫోటోలు, రీల్స్‌ను ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప -2'లో నటిస్తోంది. ఆ తర్వాత దళపతి విజయ్‌తో 'వారిసు', సిద్ధార్థ్ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను', రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' చిత్రాల్లో కూడా కనిపించనుంది. రష్మిక ఇటీవలే అమితాబ్ బచ్చన్ సరసన 'గుడ్‌బై'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement