![Anand Deverakonda Bags Sakshi Excellence Award For Best Debut actor For Dorasani](/styles/webp/s3/article_images/2021/09/25/011.jpg.webp?itok=XKJ4PEqL)
Sakshi Excellence Awards: సాక్షి మీడియా ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాలులో కనుల విందుగా జరిగింది. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్‌కు బెస్ట్ డెబ్యూ యాక్టర్, నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మికకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డులు దక్కాయి. వీరిద్దరూ ‘దొరసాని’ మూవీతోనే టాలీవుడ్‌కి పరిచయం కావడం విశేషం. అవార్డుల గురించి వారి మాటల్లోనే..
మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్: ఆనంద్ దేవరకొండ
‘సాక్షి’ మేనేజ్‌మెంట్‌కి స్పెషల్ థ్యాంక్స్. ‘దొరసాని’ సినిమా వచ్చి రెండేళ్లయింది. ఈ ప్యాండమిక్‌లో వచ్చిన సినిమాకి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రెండేళ్లలో నాది ఒక సినిమా థియేటర్లో (దొరసాని), ఇంకోటి (మిడిల్ క్లాస్ మెలోడీస్) ఓటీటీలో విడుదలయ్యాయి. ‘దొరసాని’ టీమ్ మధుర శ్రీధర్ సార్, సురేష్ బాబుగారు, కో స్టార్ శివాత్మిక అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు అవకాశం ఇచ్చినందకు ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ టీమ్’ అన్నే రవి సార్, డైరెక్టర్ వినోద్, ఆనంద్ ప్రసాద్‌గారు, ఆదిత్యలకు స్పెషల్ థ్యాంక్స్. ప్రస్తుతం ‘పుష్పక విమానం’ చేస్తున్నాను.
మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది: శివాత్మిక
నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసిన ‘సాక్షి’కి నా కృతజ్ఞతలు. ‘దొరసాని’ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మధుర శ్రీధర్ గారికి, ఎస్. రంగినేనిగారికి, సురేష్‌బాబుగారికి, కేవీఆర్ మహేందర్‌గారికి, ధీరజ్‌గారికి, నా కో యాక్టర్ ఆనంద్‌కి కూడా ధన్యవాదాలు. నా మొదటి సినిమాకే అవార్డు రావడం హ్యాపీగా ఉంది. ‘అమ్మా నాన్నా.. అక్కా’ (జీవిత–రాజశేఖర్–శివాని) మీ దగ్గర్నుంచే యాక్టింగ్ నేర్చుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment