
‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా సాక్షి మీడియా గ్రూప్, దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు 2020 ఇచ్చి సత్కరించింది. దీని గురించి ఆయన తనయుడు గాయకుడు ఎస్పీ చరణ్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటాల్లోనే..
‘సాక్షి యాజమాన్యం నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు ఇచ్చారు. ఇందుకు పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాం. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మా మనసంతా అక్కడే ఉంది. మా తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి మా కుటుంబసభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు వేడుకుంటున్నాన’ని తెలిపాడు.