![Vijaya Nirmala Was Truly Ahead Of Her Time - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/30/Namratha.jpg.webp?itok=zsazIswp)
నమ్రతా శిరోద్కర్
గత గురువారం ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల మరణించిన సంగతి తెలిసిందే. ‘విజయ నిర్మలగారి మరణాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను’ అన్నారు మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్. విజయ నిర్మలను గుర్తు చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు నమ్రత. దాని సారాంశం ఈ విధంగా... ‘‘నా వరకూ ఆమె ఎన్నో స్కిల్స్ ఉన్న ఉమెన్. ఆవిడతో నేను పద్నాలుగేళ్లు ప్రయాణం చేశాను. ఆమె గురించి చెప్పాలంటే.. చాలా కేరింగ్, ఆత్మీయంగా ఉంటారు. ప్రేమ నిండిన మనిషి.
డైనమిక్, స్ట్రాంగ్ అయినా కూడా ఫన్‌ని బాగా ఇష్టపడే వ్యక్తి. కాంప్రమైజ్ కాకూడదు అనేదే తన జీవిత మంత్రం. తన ఆలోచనలు, ఆచరణలను గమనిస్తే తనో నిజమైన విజనరీ అని మనం అర్థం చేసుకోవచ్చు. తన కుటుంబానికి, తనను ఇష్టపడేవాళ్లకు సపోర్ట్ సిస్టమ్‌గా నిలబడ్డారు. విజయ నిర్మలగారూ... మిమ్మల్ని బాగా మిస్ అవ్వబోతున్నాం. మిమ్మల్ని మళ్లీ చూడలేము అనే విషయాన్నే ఊహించుకోలేకపోతున్నాను’’ అంటూ తన ఎమోషన్‌ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment