అరుదైన సినిమా... ఆసక్తికరమైన పుస్తకం... - కృష్ణ | Rare movie... Interesting book... - Krishna | Sakshi
Sakshi News home page

అరుదైన సినిమా... ఆసక్తికరమైన పుస్తకం... - కృష్ణ

Published Sat, May 31 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

అరుదైన సినిమా... ఆసక్తికరమైన పుస్తకం...  - కృష్ణ

అరుదైన సినిమా... ఆసక్తికరమైన పుస్తకం... - కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన వేడుకలు శనివారం ఊటీలో జరిగాయి. సతీమణి విజయనిర్మల, పలువురు అభిమానుల సమక్షంలో కృష్ణ బర్త్‌డే కేక్ కట్ చేశారు. అలాగే, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రాసిన ‘విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి, విజయనిర్మలకు అందజేశారు. కృష్ణ మాట్లాడుతూ -‘‘నా ‘అల్లూరి సీతారామరాజు’ ఓ అరుదైన సినిమా. దాని గురించి వినాయకరావు రాసిన ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది.
 ప్రతి అభిమాని దాచుకోదగ్గ పుస్తకం ఇది’’ అన్నారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రవిశేషాలను పుస్తకరూపంలో తెచ్చిన వినాయకరావుని అభినందిస్తున్నానని, కృష్ణగారి సినీ జీవిత చరిత్ర గురించి ఆయన రాస్తున్న పుస్తకం కూడా బాగా రావాలని కోరుకుంటున్నానని విజయనిర్మల చెప్పారు. కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఈ ‘విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు’ పుస్తకావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని వినాయకరావు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement