టీడీపీలో ‘పుర’ పోరు !
పాలకొండ,న్యూస్‌లైన్: అధికాం వచ్చిం ది. ఇక పదవుల పందేరాలు మొదలయ్యాయి. పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా, తొలిసారి జరిగిన పురపోరులో అత్యధికంగా టీడీపీ 12 , స్వతంత్రులు ఐదుగురు, వైఎస్సార్‌సీపీ తరఫున ముగ్గురు విజయం సాధించారు. అయితే ఇప్పుడు పురపాలక పదవుల్లో కొందరు ‘పెద్దల’ జోక్యంతో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ముందుగానే నిర్ణయించిన విధంగా మున్సిపల్ చైర్మన్‌గా పల్లా విజయనిర్మలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైస్‌చైర్మన్ పదవిపై అందరి దష్టి పడింది. కాపు సామాజిక వార్గనికి చెందిన వ్యక్తికే ఇవ్వాలంటూ కొందరు, మైనార్టీలకు ఇవ్వాలంటూ మరికొందరు రేసులో ఉన్నారు. ఈ మేరకు పెద్ద నేతల గడపలు తొక్కుతూ ఆశీస్సులందుకునే పనిలో పడ్డారు కొంతమంది. మహిళలకే రెండు కీలక పదవులు వద్దంటూ మరికొందరు పట్టుబడుతున్నారు. దీంతో ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
కాపులకే ‘వైస్’ ఇవ్వాలని పట్టు !
పాలకొండ నగర పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం మరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ఇప్పుడంతా వైస్ చైర్మన్ పదవిపై తీవ్ర స్థాయి చర్చలు సాగుతున్నాయి. యాదవ కులానికి చెందిన మహిళకు చైర్‌పర్సన్ అవకాశం దక్కగా, వైస్‌చైర్మన్ పదవి మాత్రం పట్టణంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికే ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువ వినిపిస్తుంది. ఈ మేరకు ఈ సమాజిక వర్గానికి చెందిన నలుగురు కౌన్సిలర్లు పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఏడోవార్డు కౌన్సిలర్ ఎస్.చూడామణి పేరు ప్రచారంలోకి రాగా, మరోవైపు టీడీపీ రెబల్‌గా పోటీచేసి స్థానిక పట్టణ టీడీపీ అధ్యక్షుడిపై భారీ మెజార్టీతో విజయం సాధించిన గుమ్మిడి సింహాద్రి పేరు కూడా పరిశీలనలో ఉంది.
అయితే రెబల్‌గా పోటీ చేసిన కారణంగా మున్సిపల్ ఎన్నికలకు ముందే సింహాద్రిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకష్ణ అప్పట్లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేగా జయకష్ణ ఓడిపోవడంతో పరిస్థితుల్లో తీవ్ర మార్పులు వచ్చాయి. మున్సి పల్ ప్రాంతమంతా పల్లా కొండబాబే నిర్వహణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. ఈమేరకు ఆయన భార్య విజయనిర్మలకు చైర్మన్ పదవి స్వీకరించనున్నారు. వైస్ పదవి ఆశిస్తు న్న రెబల్ అభ్యర్థి సింహాద్రి గెలిచిన వెంటనే కొండబాబును కలిసి టీడీపీతోనే ఉంటానని ప్రకటించారు. దీంతో పాటు సీనియర్ నేత కళా వెంకటరావు ఆశీస్సులతో సింహాద్రి పదవి దక్కించుకుంటాడని, ఈ మేరకు ‘కథ’ నడుస్తోందన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎవరిని వైస్ పదవి వరిస్తోందో చూడాలి.