
సాక్షి, అమరావతి : అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా విజయనిర్మల మృతిపై తమ సంతాపాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా నగరంలోని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు.
విజయనిర్మల మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలను ఆయన కొనియాడారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment