
గురువారం ఉదయం తుదిశ్వాస విడిచిన నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల భౌతికకాయం నానక్‌రామ్ గూడలోని ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ఈ రోజంతా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇంటికి చేరిన విజయ నిర్మల పార్థివదేహాన్ని చూసిన కృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు భౌతికకాయానికి నివాళులర్చించేందుకు తరలివస్తున్నారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతికాయాన్ని ఫిలించాంబర్‌లో కొంత సమయం ఉంచిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విజయనిర్మల మరణంతో ఈ రోజు జరగాల్సిన ‘కల్కి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకతో పాటు రేపు జరగాల్సిన ‘మహర్షి’ సినిమా 50 రోజుల వేడుకలను రద్దు చేశారు.
కాగా, విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్‌రామ్‌గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment