
అభిమానుల మధ్య సూపర్ స్టార్ జన్మదిన వేడుకలు
రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరంలోని ఫాంహౌస్లో అభిమానుల మధ్య సూపర్ స్టార్ క్రిష్ణ 74 వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలతో పాటూ అభిమానులు పెద్ద ఎత్తున హజరయ్యారు.
భార్య విజయ నిర్మలతో కలిసి కేక్ కట్ చేయడం సంతోషంగా ఉందని క్రిష్ణ అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా తాను అభిమానులకు శ్రీశ్రీ సినిమాను కానుకగా ఇస్తున్నానని, సినిమా విజయవంతం చేయాలనీ కృష్ణ కోరారు. విజయ నిర్మల మాట్లాడుతూ అభిమానులు మధ్య ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.