విజయనిర్మలకు చిత్రపటాన్ని అందజేస్తున్న భోగ కిరణ్‌కుమార్
సాక్షి, భూదాన్‌పోచంపల్లి (నల్గొండ): పోచంపల్లితో ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మలకు ఎంతో అనుబంధం ఉంది. 1987లో విజయనిర్మల దర్శకత్వంలో పోచంపల్లిలోని పాత చేనేత సహకార సంఘంలో ‘కలెక్టర్ విజయ’ సినిమా షూటింగ్ జరిగింది. కాగా సంఘంలో వస్త్రాలు కొనుగోలు చేసిన సన్నివేశాలతో పాటు, పల్లె నేపథ్యానికి చెందిన సన్నివేశాలను చిత్రీకరించారు.
పోచంపల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన కృష్ణ, మహేశ్‌బాబు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు భోగ కిరణ్‌కుమార్ విజయనిర్మలతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పోచంపల్లి ఇక్కత్ చీరలంటే విజయనిర్మల చాలా ఇష్టపడేవారని ఆయన చెప్పారు. ఆమె కోరిక మేరకు పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను బహూకరించానని పేర్కొన్నారు.
ఇంటికి వచ్చిన వారిని ఎంతో ఆప్యాయతతో పలకరించేవారని భోగ కిరణ్ తెలిపారు. విజయనిర్మల అకాల మృతి అభిమానులకు తీరని లోటని అన్నారు. అత్యధిక సినిమాలను నిర్మించిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్‌వరల్డ్ రికార్డుకెక్కిన ఘనత ఆమెకు దక్కిందన్నారు. విజయనిర్మల కుమారుడైన హీరో నరేశ్, అతని కుమారుడు నవీన్‌లకు కూడా పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment