pochampally sarees
-
‘పోచంపల్లి ఇకత్ మేళా’ షురూ
-
పోచంపల్లితో విజయనిర్మలకు అనుబంధం
సాక్షి, భూదాన్‌పోచంపల్లి (నల్గొండ): పోచంపల్లితో ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మలకు ఎంతో అనుబంధం ఉంది. 1987లో విజయనిర్మల దర్శకత్వంలో పోచంపల్లిలోని పాత చేనేత సహకార సంఘంలో ‘కలెక్టర్ విజయ’ సినిమా షూటింగ్ జరిగింది. కాగా సంఘంలో వస్త్రాలు కొనుగోలు చేసిన సన్నివేశాలతో పాటు, పల్లె నేపథ్యానికి చెందిన సన్నివేశాలను చిత్రీకరించారు. పోచంపల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన కృష్ణ, మహేశ్‌బాబు అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు భోగ కిరణ్‌కుమార్ విజయనిర్మలతో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పోచంపల్లి ఇక్కత్ చీరలంటే విజయనిర్మల చాలా ఇష్టపడేవారని ఆయన చెప్పారు. ఆమె కోరిక మేరకు పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను బహూకరించానని పేర్కొన్నారు. ఇంటికి వచ్చిన వారిని ఎంతో ఆప్యాయతతో పలకరించేవారని భోగ కిరణ్ తెలిపారు. విజయనిర్మల అకాల మృతి అభిమానులకు తీరని లోటని అన్నారు. అత్యధిక సినిమాలను నిర్మించిన మహిళా దర్శకురాలుగా గిన్నీస్వరల్డ్ రికార్డుకెక్కిన ఘనత ఆమెకు దక్కిందన్నారు. విజయనిర్మల కుమారుడైన హీరో నరేశ్, అతని కుమారుడు నవీన్‌లకు కూడా పోచంపల్లితో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. -
రిమ్జిమ్.. రిమ్జిమ్.. హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు వచ్చే దేశవిదేశాల ప్రతినిధులకు హైదరాబాద్ అందాలను, చారిత్రక, పర్యాటక స్థలాలను చూపించేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారి మనసు దోచుకొనేలా పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. నగరంతోపాటు తెలంగాణ పల్లె అందాలు, సంస్కృతిని చూపే ఏర్పాట్లు చేసింది. డెలిగేట్లకు ఆతిథ్యమివ్వడంలో, మర్యాదల్లో ఏ లోపానికి తావులేకుండా ఉండేలా హోటల్ మేనేజ్మెంట్, ఆతిథ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఆధ్యాత్మిక పర్యటన నగరంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే ఈ పర్యటనలో బిర్లామందిర్, జగన్నాథస్వామి టెంపుల్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చి తదితర ప్రాంతాలు ఉంటాయి. ప్లాజా హోటల్లో భోజన వసతి ఉంటుంది. ఈ టూర్ చార్జీ రూ.6,000. అమెరికా కరెన్సీలో సుమారు 95 డాలర్లు. ఈ పర్యటన ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. విలేజ్ టూర్.. ఈ టూర్లో భాగంగా నగరానికి సమీపంలోని వికారాబాద్‌లో వ్యవసాయ క్షేత్రాలు, సాంప్రదాయ జీవన విధానాన్ని, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. గ్రామాల్లో విదేశీ టూరిస్టులను ఎడ్ల బండ్లపై తిప్పుతారు. చక్కటి పల్లె పర్యటన అనుభూతి కలిగిస్తారు. రుసుము రూ.6,000 (95 డాలర్లు). మైక్రో బ్రేవింగ్ ఎక్స్పీరియన్స్ విదేశీ పర్యాటకులను ఆకట్టుకొనే మరో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఇది. ఆలివ్ బిస్ట్రోలో మైక్రో బ్రేవింగ్ రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మైక్రోబ్రేవింగ్ సందర్శనతో పాటు ఇటాలియన్ డిన్నర్, లైవ్ మ్యూజిక్ ఉంటాయి. రుసుము రూ.6,000 (95 డాలర్లు). క్రాఫ్ట్ అండ్ కల్చరల్ టూర్ తారామతి బారాదరిలో పతంగుల ఉత్సవం, సాంస్కృతిక ప్రదర్శన, భారతీయ వంటకాల తయారీ, ఇక్కత్ చేనేత వస్త్రాలు, హస్తకళలు వంటివి ఉంటాయి. ఈ సందర్శనకు రూ.12,000 రుసుము (125 డాలర్లు). భోజనం, రవాణా తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. వీటితోపాటు గోల్ఫ్ టూర్, సైక్లింగ్ టూర్, రామోజీ ఫిల్మ్‌సిటీ, గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో టూర్లు కూడా ఉన్నాయి. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, గోల్కొండ ఎంపోరియం తదితర ప్రాంతాల సందర్శన ఉంటుంది. బొట్టుపెట్టి ఆహ్వానం.. తోడుగా గైడ్లు పలుదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను సాదరంగా నగరానికి ఆహ్వానించేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ బృందం ఈ నెల 27నుంచే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిద్ధంగా ఉంటుంది. విమానాశ్రయానికి చేరుకునే ప్రతినిధులందరికీ సాదర స్వాగతం పలుకుతూ నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. అనంతరం వారిని ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి తీసుకెళ్తారు. విమానాశ్రయం నుంచి ఆర్టీసీ, పర్యాటక శాఖ బస్సుల్లో ప్రతినిధులు బస చేసే హోటళ్లకు తీసుకెళతారు. ప్రతి బస్సులో ఇద్దరు గైడ్స్ ఉంటారు. అలాగే నగరానికి రానున్న సుమారు 2,000 మంది ప్రతినిధులు బస చేయనున్న 20 హోటళ్లలోనూ శిక్షణ పొందిన గైడ్స్ ఉంటారు. హోటళ్ల నుంచి హెచ్ఐసీసీకి, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వారు తమ సేవలు అందజేస్తారు. 28 నుంచి 30 వరకు సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీతో పాటు ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట, చార్మినార్, లాడ్ బజార్ తదితర ప్రాంతాల్లోనూ పర్యాటకాభివృద్ధి సంస్థ గైడ్లు ఉంటారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి శిక్షణ పొందిన వారిని కూడా నగరానికి రప్పించారు. కులీకుతుబ్‌షా టూంబ్స్ సందర్శన హైదరాబాద్ చారిత్రక, వారసత్వ కట్టడాల పర్యటనలో భాగంగా రూపొందించిన ‘హైదరాబాద్ హెరిటేజ్ టూర్’లో కులీకుతుబ్‌షా టూంబ్స్, గోల్కొండ కోట, తారామతి బారాదరి సాంస్కృతిక వేదిక ఉంటాయి. భోజన సదుపాయంతో కూడిన ఈ టూర్లో తారామతి బారాదరి వద్ద తోలుబొమ్మలాట వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, ముత్యాలు, గాజుల ప్రదర్శన, చేనేత వస్త్రాల తయారీ వంటి ప్రదర్శనలు ఉంటాయి. ఈ పర్యటన రుసుము రూ.5,000. అమెరికా కరెన్సీలో 80 డాలర్లు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ టూర్ ఉంటుంది. పోచంపల్లి చీరలతో వలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించాలన్న లక్ష్యంతో.. సదస్సు జరుగనున్న హెచ్ఐసీసీ వద్ద 300 మంది యువతులు పోచంపల్లి చీరలను ధరించి వలంటీర్లుగా విధులు నిర్వహించనున్నారు. ప్రతినిధులకు కావాల్సిన సదుపాయాలను.. సలహాలు, సూచనలను అందజేస్తారు. వేదిక వద్ద అందుబాటులో ఉండి అవసరమైన సహాయం చేస్తారు. -
ఇవాంకాకు పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్
భూదాన్ పోచంపల్లి (భువనగిరి): హైదరాబాద్‌లో ఈ నెల 28న జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్‌కు తెలంగాణ ప్రభుత్వం రెండు పోచంపల్లి పట్టుచీరలు, డైమండ్ నెక్లెస్ బహూకరించనున్నట్లు తెలిసింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి చేనేత కుర్తా, పైజామా బహుమానంగా ఇవ్వనున్నట్లు సమాచారం. సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు కూడా పోచంపల్లి వస్త్రాలు బహూకరించాలని.. తద్వారా చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాచుర్యం వస్తుందని సర్కారు భావిస్తోంది. మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనే 200 మంది మహిళా వలంటీర్లు పోచంపల్లి కాటన్ మస్రస్ చీరలు ధరించనున్నారు. ఇందుకోసం పోచంపల్లిలో 200 ‘టెస్కో’రకం పట్టుచీరలను ప్రత్యేకంగా తయారు చేయించారు. జీఈఎస్ అతిథులకు అమెరికా తేనీటి విందు 30న నోవాటెల్‌లో.. సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు వచ్చే అతిథులకు అమెరికా ప్రభుత్వం తరఫున స్థానిక యూఎస్ కాన్సులేట్ అధికారులు తేనేటి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం నోవాటెల్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా గురించి ప్రజెంటేషన్ కూడా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఈ నెల 28న చారిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, 29న రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. -
ఆప్కో..తీస్కోదేం?
రామన్నపేట, న్యూస్‌లైన్ : చేనేత వస్త్రాల ఉత్పత్తికి జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ తయారైన డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, మెర్స్రైజ్డ్(మస్స్) చీరలు, దోవతులు ప్రపంచ వ్యాప్త్తంగా ప్రాచుర్యం పొందాయి. పోచంపల్లి చీరలు జిల్లాకే తలమానికంగా నిలిచాయి. అలాంటి చేనేత పరిశ్రమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఆప్కో ఆరునెలల నుంచి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలోని దాదాపు అన్ని చేనేత సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు మూలుగుతున్నాయి. గత జూన్‌లో కొనుగోలు చేసిన వస్త్రాలకు ఇప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో 42 కాటన్, 30 సిల్క్చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 25వేల మంది సభ్యులుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా సహకార రంగంలో 13వేలు, సహకారేతర రంగంలో 10వేలకుపైగా మగ్గాలు నడుస్తున్నాయి. కార్మికులు నేసిన వస్త్రాలను సొసైటీలు కొనుగోలు చేసి ఆప్కో ద్వారా విక్రయిస్తారు. రూ.ఏడుకోట్లకు పైగా విలువైన వస ్తన్రిల్వలు జూన్, జూలై మాసాల్లో ఆప్కో వారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఆరు నెలలుగా కొనుగోళ్లు జరపకపోవడంతో కేవలం చేనేత సహకార సంఘాల్లోనే రూ.7కోట్ల మేర వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ప్రధానంగా పోచంపల్లి, కొయ్యలగూడంలలో రూ.కోటి, సిరిపురంలో రూ.90లక్షలు, చౌటుప్పల్‌లో రూ.50 లక్షలు. గట్టుప్పల్‌లో రూ.70లక్షలు, బోగారంలో రూ.10లక్షలు, వెల్లంకిలోరూ. 20లక్షలు, కుంట్లగూడెంలో రూ.25లక్షలు, వెలువర్తిలో రూ.10లక్షలు, గుండాలలో రూ.20లక్షలు, మోత్కూరులో రూ.20లక్షలు, పల్లెర్లలో రూ.30లక్షలు, నకిరేకల్లోరూ.10లక్షల విలువైన వస్త్ర నిల్వఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోతున్న నేతన్నలు బిల్లులు సకాలంలో రాకపోవడంతో నేతకార్మికులు అప్పులపాలవుతున్నారు. వస్త్రాల ఉత్పత్తికి అవసరమయ్యే నూలు, రంగులు కొనుగోలు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. కుటుంబ పోషణ కోసం, పెట్టుబడుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. బ్యాంకు రుణాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వస్త్రాలు కొనుగోలు చేయాలి : అప్పం రామేశ్వరం, అధ్యక్షుడు, సిరిపురం చేనేతసహకారసంఘం చేనేత సహకార సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను ఆప్కోవారు వెంటనే కొనుగోలు చేయాలి. గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలి. లేకుంటే కార్మికులు, సహకార సంఘాలు అప్పులపాలయ్యే ప్రమాదం ఉంది.