Subbu
-
అందు కోసమే బచ్చలమల్లి మూవీ తీశా: డైరెక్టర్ సుబ్బు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ..'బచ్చలమల్లి క్యారెక్టర్ పేరు నిజమే. కథ మాత్రం నేనే రాసుకున్నా. నా లైఫ్‌లో మా అమ్మ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఈ చిత్రం కూడా మా అమ్మకు రాసిన క్షమాపణ లేఖ. నేను చేసిన తప్పు వల్ల చాలా బాధపడ్డా. నాలాగా ఇంకొకరు బాధ పడొద్దనే ఈ సినిమా ఉద్దేశం. తర్వాత అయినా అమ్మకు చెప్తా. నీ కోసం బచ్చలమల్లి సినిమా తీశానని' అంటూ డైరెక్టర్ మాట్లాడారు.(ఇది చదవండి: బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్)ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బచ్చలమల్లి ఈనెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నరేశ్, అమృత అయ్యర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌కు హాజరయ్యేందుకు హీరో, హీరోయిన్ సైకిల్‌పై వచ్చి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. -
ఆ విషయాన్ని నిజాయతీగా చెప్పాను: సుబ్బు మంగాదేవి
‘బచ్చల మల్లి’ మూవీ క్యారెక్టర్ బేస్డ్ కథ. ఇందులో తండ్రికి సంబంధించిన భావోద్వేగ అంశాలు ప్రధానంగా ఉంటాయి. కరోనా టైమ్‌లో నా తల్లిని కోల్పోయాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. జీవితంలో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు మూర్ఖత్వంతో చేయొద్దనే విషయాన్ని చాలా నిజాయతీగా చెప్పాను’’ అని డైరెక్టర్ సుబ్బు మంగాదేవి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా సుబ్బు మంగాదేవి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రాజేష్ దండాగారికి నేను చెప్పిన ‘బచ్చల మల్లి’ కథ నచ్చడంతో, నరేశ్‌గారికి చెప్పమన్నారు. కథ విన్న నరేశ్‌గారు వెంటనే సినిమా చేద్దామన్నారు. ‘పుష్ప 1’లో అల్లు అర్జున్‌గారిది కూలీ పాత్ర. ఇందులో బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్‌గా చేశారు నరేశ్‌గారు.అలా ఆయన గెటప్ విషయంలో ΄ోలిక తప్ప కథ విషయంలో కాదు. ‘బచ్చల మల్లి’ కథని ఎమోషనల్‌గా చెప్పాలనుకున్నాం. ఇందులో మంచి ప్రేమకథ ఉంది. నేను 1990లలో ఊర్లో పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారో నాకు తెలుసు. అందుకే 1990 నేపథ్యంలో ఈ కథ చెప్పాలనుకున్నాను. బచ్చల మల్లి పాత్రకి నరేశ్‌గారు పూర్తి న్యాయం చేశారు. నా తర్వాతిప్రాజెక్ట్స్ కోసం కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయి. ‘బచ్చల మల్లి’ రిలీజ్ తర్వాత వాటిపై దృష్టి పెడతాను’’ అన్నారు. -
క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు.. పేదరికం అడ్డొచ్చింది.. అయితేనేం..
ఎంతో ఇష్టమైన క్రికెట్లో రాణించాలని కలలు కన్నాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాలని, దేశానికి పేరు తేవాలని పదేపదే పరితపించాడు. అయితే టాలెంట్ ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఆటపై ఉన్న మక్కువ పేదరికాన్ని జయించేలా చేసింది. తాను ఆడలేని క్రికెట్‌ను పదిమందితో ఆడించాలని భావించాడు. అభినవ ద్రోణాచార్యలా మారాడు. ఎందరికో అంతర్జాతీయస్థాయిలో తర్ఫీదునిస్తూ తన కలలను సాకారం చేసుకుంటున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. సాక్షి, అల్లూరి సీతారామరాజు(చింతూరు): క్రికెట్లో ఎంతోమందికి తర్ఫీదునిస్తూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. పేదరికం కారణంగా మధ్యలోనే ఆటకు స్వస్తి పలికిన సుబ్బు తన కలల సాకారానికి అడ్డొచ్చిన పేదరికాన్ని అసహ్యించుకోలేదు. తాను సాధించలేనిది తన శిక్షణతో పలువురిని ఆటలో తీర్చిదిద్దేందుకు నడుం బిగించాడు. ఖర్చుతో కూడుకున్నదైనా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి పలువురు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు. వారు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తున్నాడు. స్థానికంగానే చదువు.. సుబ్బు తండ్రి సత్యనారాయణ వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సబ్బు చింతూరులో ఇంటర్ వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతను స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో ఆడుతూ మంచి నైపుణ్యం సాధించాడు. అదే సమయంలో అకాడమీలో చేరి క్రికెట్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశించాడు. అతనికి పేదరికం అడ్డురావడంతో ఆశయానికి బ్రేక్‌పడింది. అనంతరం భద్రాచలంలో డిగ్రీలో చేరిన సుబ్బు 2010 నుంచి 2014 వరకు ఐదేళ్లపాటు చిన్నారులకు క్రికెట్లో కోచింగ్ ఇచ్చాడు. 2015 నుంచి 2016 వరకు హైదరాబాద్‌లోని సెయింట్‌జోన్స్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పనిచేశాడు. 2016లో హైదరాబాద్‌లో ఎరీనా ఎలైట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి 2020 వరకు ఎందరో చిన్నారులకు క్రికెట్ ఓనమాలు నేర్పాడు. అనంతరం 2020లో తిరిగివచ్చిన ఆయన శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమి పేరుతో సంస్థను నెలకొల్పాడు. ప్రస్తుతం అదే పేరుతో 30 మంది చిన్నారులకు కోచింగ్ ఇస్తున్నాడు. రాణించిన త్రిష భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష 2010 నుంచి 2014 వరకు భద్రాచలంలో సుబ్బు కోచింగ్‌లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది. దీంతో త్రిష హైదరాబాద్ జట్టుతో పాటు ఇండియా అండర్–16, అండర్–19 జట్లకు ఎంపికైంది. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు ఎంపికై మరిన్ని మెళకువలు నేర్చుకుంది. ఇటీవల అండర్–19 మహిళా జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించడం ద్వారా అండర్–19 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత్ మహిళా జట్టుకు ఎంపికైంది. ఇదే బాటలో మరెందరో చిన్నారులు సుబ్బు కోచింగ్‌లో రాటుదేలుతున్నారు. ఉన్నత అవకాశాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. భారత్ జట్టులో ఆడాలనుకున్నా చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఇండియా జట్టు తరఫున ఆడాలనుకున్నా. అనివార్య కారణాలతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టమైన ఆటను వదల్లేక కోచ్‌గా బాధ్యతలు చేపట్టి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాను. నా కోచింగ్‌లో రాటుదేలిన త్రిష ఇండియా జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా కళ ఇలా సాకారం చేసుకుంటున్నా. –పాసర్లపూడి సుబ్రహ్మణ్యం, క్రికెట్ కోచ్, చింతూరు -
మెగా ఫోన్ పట్టిన బోయపాటి శిష్యుడు..స్టైలిష్ ఎంటర్టైన్మెంట్ షురూ!
కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. మంచి కంటెంట్‌తో వస్తే చాలు.. ఒక్క సినిమాతోనే అతన్ని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరుస్తారు. అందుకే యువ దర్శకులు ఎప్పుడూ తెలుగులో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. తాజాగా టాలీవుడ్‌కి మరో డైరెక్టర్ పరిచయం కానున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్ గా దర్శకత్వ శాఖ లో పనిచేసిన సుబ్బు మెగా ఫోన్ పట్టనున్నారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏ ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. స్టైలిష్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ కవుటూరి హీరోగా నటిస్తున్నారు. ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నట్టు సమాచారం. -
దారుణం: ఐసియూలో బెడ్ దొరక్క డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ దర్శకుడు సుబ్బు ఇంట విషాదం నెలకొంది. మే 16న ఆయన తల్లి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా పరీక్షించి సుబ్బు తల్లి మంగమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఆస్పత్రి ఐసీయూలో బెడ్ దొరకకపోవడంతో సమయానికి ఆక్సిజన్ అందక ఆరోగ్యం విషమించి మంగమ్మ తుది శ్వాస విడిచారు. అయితే సుబ్బు ‘సోలో బ్రతుకే సో బెటర్’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక-నిర్మాతలు ఎంతోమంది కరోనా కన్నుమూస్తున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన సీనియర్ నటుడు గౌతమ్ రాజు తమ్ముడు సిద్ధార్థ ఆక్సిజన్ కొరతతో మరణించిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ పియా బాజ్ పేయి సోదరుడు కూడా ఆక్సిజన్ దొరక్క మరణించాడు. సామాన్య ప్రజలు నుంచి సెలబ్రిటిల వరకు కరోనా సెకండ్ వేవ్ దాటికి అల్లాడిపోతున్నారు. చదవండి: 'అసురన్' నటుడు మృతి -
నా విజయం వాయిదా పడిందనుకున్నా!
‘‘నా చిన్నప్పుడు దూరదర్శన్ రోజుల్లో మా ఊర్లో మాకు టీవీ ఉండేది. ఆ టీవీ ముందు మా ఊరు మొత్తం ఉండేది. వీసీఆర్లో సినిమాలు వేసుకొని చూసే వాళ్లం. వీసీఆర్‌ని నేనే ఆపరేట్ చేసేవాడ్ని. దాంతో అక్కడ నన్ను అందరూ స్పెషల్‌గా చూసేవారు. అలా సినిమా మీద ఆసక్తి, ఇష్టం, పిచ్చి మొదలైంది’’ అన్నారు దర్శకుడు సుబ్బు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు సుబ్బు పుట్టినరోజు. ఈ సందర్భంగా సుబ్బు చెప్పిన విశేషాలు.. ► ‘‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఫిలాసఫీని నమ్మే ఓ కుర్రాడి కథే ఈ సినిమా. దానివల్ల అతను ఎదుర్కొన్న సంఘటనలు, సమస్యలు ఈ సినిమాలో ఉంటాయి. సాయి ధరమ్ తేజ్ పాత్ర, స్టోరీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. స్నేహితులకు, తెలిసినవాళ్లకు ఇలాంటి సందర్భం ఎదురయినట్టు ఉండే సీన్స్ చాలా ఉంటాయి. పాటలు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యాము. ఈలోగా లాక్ డౌన్ వచ్చింది. దాంతో మా సినిమా విడుదల వాయిదా పడింది. నా సక్సెస్ కాస్త పోస్ట్ పోన్ అయిందనుకున్నాను. ఈ సినిమాను మరింత మెరుగుపరచుకునే అవకాశం వచ్చిందని భావించి సినిమా మీద ఇంకా వర్క్ చేశా. ► ఈ లాక్డౌన్లో కథలు వర్కవుట్ చేశాను. ఆల్రెడీ 3 కథలకు ఆలోచనలు ఉన్నాయి. ఒకదాన్ని పూర్తి చేశా. ‘బొమ్మరిల్లు’ భాస్కర్, విరించి వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాను. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ‘ఊసరవెల్లి, ఒంగోలు గిత్త’ సినిమాలు చేశాను. ఇదే బ్యానర్ లో దర్శకుడిగా నా మొదటి సినిమా చేయడం సంతోషంగా ఉంది. నా రెండో సినిమా ఈ బ్యానర్ లోనే ఉంటుంది. మొదటి సినిమా పట్టాలెక్కాలంటే చాలా కష్టం అంటారు. కానీ అదష్టవశాత్తు నా ప్రయాణం చాలా సాఫీగా జరిగినట్లే. మంచి నిర్మాత, అర్థం చేసుకునే హీరో దొరికారు. ► మాది తుని. పూరి జగన్నాథ్ గారు, గుణశేఖర్ గారు మా పక్కన ఊరే. వాళ్లు సినిమాల్లో సక్సెస్ అయ్యారు మనం కూడా అవొచ్చనే బూస్ట్ వచ్చింది. మనం చెప్పే కథలతో కేవలం వినోదం పంచాం అన్నట్టు కాకుండా మన కథలకు కనెక్ట్ అయి ప్రేక్షకులు ఆలోచించేలా, వాళ్లకు ఓ నమ్మకం కలిగించేలా నా సినిమాలు ఉండాలనుకుంటాను. చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని నా డ్రీమ్. -
ఆసక్తికరంగా ‘రాహు’ టీజర్
బ్యాడ్ టైమ్‌లో బ్యాడ్ ప్లేస్‌లో ఓ అమ్మాయి చిక్కుకుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రాహు’. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏవిఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ... ‘నేను ఈ ప్రొఫెషన్లోకి రాకముందు ఆర్కిటెక్ గా పని చేసేవాడ్ని ఒక ఫొటో వంద మాటలు చెపుతుంది అన్నట్లు ఒక సినిమా వెయ్యి మాటలను చెపుతుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అభిరామ్, కృతిక చాలా బాగా నటించారు. మా ఎడిటర్ అమర్ చాలా బాగా ఎడిట్ చేశారు. నాకు ఈ జోనర్ చాలా కంఫర్ట్ అనిపించింది’అన్నారు. ప్రొడ్యూసర్ స్వామి మట్లాడుతూ... ‘మాకు సినిమా గురించి ఏమీ తెలియదు. సుబ్బుగారు వచ్చి కథ చెప్పారు. కథ నచ్చి ఆయనతో కలిసి మరో ముగ్గురం మొత్తం నలుగురం కలిసి ఈ సినిమాని నిర్మించి ఇంత దూరం తీసుకువచ్చాం. ఇక దేవుడి పైనే భారం వేశాం’ అన్నారు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ... ‘ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాతో కలిసి ఈ సినిమా నటించిన అందరూ మంచి వారు. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. హీరో అభిరామ్ మాట్లాడుతూ... ‘సుబ్బుగారికి ప్రొడ్యూసర్స్‌కి నా థ్యాంక్స్. ఈ కథ విని నచ్చి చేశాను. కృతికి కూడా కృతజ్ఞతలు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బి.వి.ఎస్.ఎన్గారికి, మధుర శ్రీధర్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అన్నారు. బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ... ‘ఒక థ్రిల్లింగ్ చిత్రాన్ని ఇంత దూరం తీసుకురావడమే చాలా కష్టం. షూటింగ్ వరకు తీసుకువెళ్ళాక నాలాంటి వారు కొన్ని మార్పులు చెపుతారు కొంచెం, కామెడీ యాడ్ చెయ్యమని, కొన్ని మాటలని, కొంత లవ్ యాడ్ చెయ్యమని ఇలా అంటుంటారు. కాని వీళ్ళు అమెరికా నుండి వచ్చిన ఒక దర్శకుడిని నమ్మి ఈ అవకాశం ఇవ్వడం. ఈయన వాళ్ళని నమ్మించడం చాలా గ్రేట్ వారిద్దరికి ముందుగా అభినందనలు. చాలా మంది అనుకుంటారు విదేశాల్లో చదువుకుని వస్తారు వీళ్ళకు సినిమాల ఏమి తెలుసు అని. కాని శేఖర్‌కమ్ముల, అడవిశేషు ఇలా చాలా మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు’ అన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా రాహు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మాట్లాడుతూ.. ‘కొత్త సబ్జెక్ట్స్‌తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాని రివల్యూషనైజ్ చేస్తున్నారు. ఇది కూడా అలాటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది’ అన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ ఫిలిం స్కూల్లో పట్టా పొందిన సుబ్బు.. రాహు సినిమాను టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు. ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్కరాజు సంగీతమందిస్తున్నారు. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
ఏం చెబుతాడో ఏమో!
సాక్షి, అమరావతిబ్యూరో : తెలంగాణ పోలీసుల విచారణలో రౌడీషీటర్ సుబ్బు ఏమి చెబుతాడో ఏమో..? ఎలాగైనా అతడిని రక్షించాలి... ఇదొక్కటే ప్రస్తుతం విజయవాడకు చెందిన టీడీపీ పెద్దల ముందున్న ఏకైక లక్ష్యం. అక్రమంగా ఆయుధాల కొనుగోలుకు యత్నించిన కేసులో అతడిని రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ పోలీ సులకు అప్పగించారు. అక్కడి పోలీసుల విచారణలో సుబ్బ ఏ విషయాలు బయటపెడతాడో...? అవి తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అనే గుబులు విజయవాడ టీడీపీ పెద్దలకు నిద్రపట్టకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాకు వెల్లడించారు. టీడీపీ పెద్దల అండతోనే...!? గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాళిదాసు సుబ్రహ్మణ్యం అలియాస్ వేమూరి సుబ్బు ఓ రౌడీ షీటర్. అతడిని విజయవాడ టీడీపీ పెద్దలు మరింతగా పెంచిపోషించారు. తమ రాజకీయ అవసరాల కోసం అతడికి అండదండలు అందించారు. సుబ్బు విజయవాడకు చేరిన కొత్తలో కొన్నాళ్లు కాట్రగడ్డ శ్రీనుకు అనుచరుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే వంగవీటి శంతన్‌కుమార్‌పై జరి గిన కాల్పుల కేసులో అతడిని పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అనంతరం సుబ్బు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గంలో చేరాడు. కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే బొండాకు అత్యంత సన్నిహితుడిగా మారడం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సుబ్బు సాన్నిహిత్యం పెంచుకున్నాడని ఫొటో ఆధారాలు చెబుతున్నాయి. సుబ్బు రాజ రాజేశ్వరిపేట కేంద్రంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అండదండలతోనే సుబ్బు అంతగా చెలరేగిపోతున్నాడని కూడా పోలీసులు గుర్తించారు. విజయవాడలో సద్దుమణిగిందనుకున్న రౌడీ వ్యవస్థను టీడీపీ పెద్దలు మళ్లీ పెంచిపోషించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లలో మళ్లీ రౌడీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ పెద్దల్లో కలవరం హైదరాబాద్ పోలీసులు ఛేదించిన అక్రమ ఆయుధాల కొనుగోలు కేసులో సుబ్బు పాత్ర బయటపడంతో టీడీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. తెనాలిలో ప్రతీకార దాడుల కోసమే సుబ్బు అక్రమంగా ఆయుధాల కొనుగోలుకు యత్నించాడని పోలీసులు ప్రాథమికంగా భావించారు. అయితే ఈ కేసులో అంతకుమించిన కోణం ఉందని తెలుస్తోంది. అదేమిటన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉన్నప్పటికీ పోలీసువర్గాల్లో కలకలం రేపుతోంది. మరో వైపు సుబ్బును విజయవాడ పోలీసులు అరెస్టు చేసి తెలంగాణ పోలీసులకు అప్పగించారు. తెలంగాణ పోలీసుల విచారణలో అతను ఏం చేబుతాడోనని టీడీపీ పెద్దలు కలవరపడుతున్నారు. అక్రమ ఆయుధాల కొనుగోలు యత్నం వెనుక టీడీపీ పెద్దల ప్రయోజనాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారిస్తే తీవ్ర సంచలనంగా మారుతుంది. దీంతో అతడిని రక్షించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు విజయవాడకు చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన కొందరు ఉన్నతాధికారులు, పెద్దలతో తమకున్న పరిచయాలను తిరగదోడుతూ మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. వీలైనంత త్వరగా సుబ్బుకు బెయిల్ వచ్చేలా చేసేందుకు ఇప్పటికే కొందరిని హైదరాబాద్‌కు పంపించి నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల విచారణతో అక్రమ ఆయుధాల కేసు, దానితో విజయవాడకు ఉన్న సంబంధాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతలను పరిరక్షిస్తాం : సీపీ సవాంగ్ రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ స్పష్టంచేశారు. విజ యవాడలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. సుబ్బుపై గతంలో తెనాలిలో రౌడీషీట్ ఉందని తెలిపారు. గతంలో విజయవాడలో శంతన్‌కుమార్‌పై జరిగిన కాల్పుల కేసులో అతను నింది తుడని కూడా చెప్పారు. అయితే ఆ కేసును 2012లో కొట్టివేశారన్నారు. 2014లో తెనాలిలో మేడిశెట్టి కృష్ణ హత్య కేసులో ఇతను నిందితుడని చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా తెనాలిలో ఉండొద్దని అక్కడ పోలీసులు చెప్పడంతో సుబ్బు విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు వచ్చి వెళ్తున్నాడని వివరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈశ్వర్‌రెడ్డితో సుబ్బుకు పరిచయం ఉందన్నారు. ఈశ్వర్‌రెడ్డి చత్తీస్‌ఘడ్‌లో ఉండగా బిహార్‌కు చెందిన పప్పూతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. సుబ్బుకు విక్రయించేందుకే పప్పూ వద్ద రెండు తుపాకులు కొన్నానని ఈశ్వర్‌రెడ్డి తెలంగాణ పోలీసుల విచారణలో వెల్లడించాడని సీపీ సవాంగ్ చెప్పారు. తనవద్ద ఆ తుపాకులు ఉన్నాయనే ఈశ్వర్‌రెడ్డి చెప్పాడని, తాను మాత్రం కొనుగోలు చేస్తాననలేదని సుబ్బు తమ విచారణలో చెప్పాడని సీపీ వివరించారు. ఈ కేసులో వాస్తవాలేమిటో తెలుసుకునేందుకే సుబ్బును తెలంగాణ పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఈనెల 28వ తేదీన విజయవాడలో ప్రొఫెసర్ ఐలయ్య నిర్వహించే సభ కోసం ఇంత వరకు తమకు ఎలాంటి దరఖాస్తు రాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీ సవాంగ్ సమాధానం చెప్పారు. అనుమతి కోరితే నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ప్రేమలో పడితే...
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రను హీరోగా పరిచయం చేస్తూ శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ఆర్వీ సుబ్బు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం. అలాగే ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీ హండ కథానాయికగా నటిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పాటలను, అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమంటే పడని ఓ యువకుడు ప్రేమలో పడ్డ తర్వాత తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనేది ప్రధానాంశం. కొత్త కోణంలో ఉండే ప్రేమ కథ. ప్రేమ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. మణిశర్మ స్వరపర చిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, జగదీష్, ఆర్ట్: కె.వి.రమణ.