
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ దర్శకుడు సుబ్బు ఇంట విషాదం నెలకొంది. మే 16న ఆయన తల్లి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా పరీక్షించి సుబ్బు తల్లి మంగమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఆస్పత్రి ఐసీయూలో బెడ్ దొరకకపోవడంతో సమయానికి ఆక్సిజన్ అందక ఆరోగ్యం విషమించి మంగమ్మ తుది శ్వాస విడిచారు. అయితే సుబ్బు ‘సోలో బ్రతుకే సో బెటర్’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా గత కొన్ని రోజులుగా భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక-నిర్మాతలు ఎంతోమంది కరోనా కన్నుమూస్తున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన సీనియర్ నటుడు గౌతమ్ రాజు తమ్ముడు సిద్ధార్థ ఆక్సిజన్ కొరతతో మరణించిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ పియా బాజ్ పేయి సోదరుడు కూడా ఆక్సిజన్ దొరక్క మరణించాడు. సామాన్య ప్రజలు నుంచి సెలబ్రిటిల వరకు కరోనా సెకండ్ వేవ్ దాటికి అల్లాడిపోతున్నారు.
చదవండి:
'అసురన్' నటుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment